`గీత గోవిందం` సంచలన విజయం సాధించడంతో విజయ్ దేవరకొండ స్టార్ డమ్ స్కై ని టచ్ చేస్తోంది. అందుకు తగ్గట్టే అతడి ప్రణాళికలు అనూహ్యంగా మారిపోయాయి. ఇప్పుడు దేవరకొండ పెద్ద స్టార్. నైజాం మెగాస్టార్ అని అప్పుడే అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. అందుకు తగ్గట్టే అతడి భవిష్యత్ ప్రాజెక్టులు ఒకటొకటిగా ఖరారవుతున్నాయి. తాజాగా తమిళ స్టార్ హీరో సూర్యతో కలిసి భారీ మల్టీస్టారర్ లో నటించేందుకు సన్నాహకాల్లో ఉన్నాడన్న సమాచారం అందింది. స్టూడియో గ్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ లాంటి క్రేజీ సంస్థ అడ్వాన్స్ ఇచ్చి దేవరకొండను లాక్ చేసిందంటే అర్థం చేసుకోవచ్చు.
ఇదే సంస్థ దేవరకొండ హీరో నిర్మించిన తాజా చిత్రం `నోటా`ని హైఫై రేంజులో రిలీజ్ చేసేందుకు సన్నాహకాల్లో ఉంది. `నోటా` ఏరియావైజ్ ప్రీ బిజినెస్ ని స్కైలోకి మళ్లించడం ఇటీవల చర్చకొచ్చింది. అయితే అంత భారీ అంచనాలు పెరిగాయి కాబట్టి - అందుకు తగ్గట్టే రెండు భారీ ఈవెంట్లను ప్లాన్ చేసింది చిత్రబృందం. ఓవైపు చెన్నయ్ సహా తమిళనాడు వ్యాప్తంగా దేవరకొండ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. అక్కడి నుంచి హైదరాబాద్ రాగానే ఇక్కడ రెండు భారీ ఈవెంట్లలో దేవరకొండ పాల్గొంటాడు.
మారిన ట్రెండ్ లో ఏపీ - తెలంగాణ రెండు చోట్లా పబ్లిసిటీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అందుకే హైదరాబాద్ - విజయవాడలో `నోటా` భారీ ఈవెంట్లు ప్లాన్ చేశారని తెలిసింది. ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ సరిగా చేయలేదు కాబట్టి ఈ రెండు ఈవెంట్లతో పీక్స్ లో పబ్లిసిటీ కొట్టేసేందుకు భారీగా దేవరకొండ అభిమానుల్ని మోహరిస్తున్నారట. ముఖ్యంగా దేవరకొండ ఏపీలోనూ అభిమాన బలం పెంచుకునే యోచనలో ఉన్నాడు. అందువల్ల విజయవాడ ఈవెంట్‌కి భారీగానే అభిమానుల్ని తరలి వస్తారన్న సమాచారం అందుతోంది. సెప్టెంబర్ 30న ఓ ఈవెంట్ - అలానే అక్టోబర్ 1న వేరొక ఈవెంట్ ని `ది నోటా పబ్లిక్ మీట్` పేరుతో భారీగా చేయనున్నారని తెలుస్తోంది.