మాస్ రాజాకి యూత్ రాజా బ్రేక్?

Update: 2018-09-09 06:42 GMT
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకే రోజు రెండు మూడు సినిమాల పోటీ అనివార్యమైపోయింది. నిర్మాతలు ఎంతగా ప్రయత్నించినా వరుసగా ఉన్న విడుదల వల్ల క్లాష్ కాక తప్పడం లేదు. అందుకే భార్యాభర్తలైన సినిమాలు శైలజారెడ్డి అల్లుడు-యుటర్న్ తలపడాల్సివస్తున్నాయి. సర్దుకునే ఛాన్స్ లేనప్పుడు లేదా కంటెంట్ మీద చాలా  గట్టి నమ్మకం ఉన్నప్పుడు ఇలా చేయటం కొత్తేమి కాదు. కానీ ప్రత్యర్థి మనకన్నా చాలా బలంగా ఉన్నప్పుడు మాత్రం తెలివిగా అలోచించి నిర్ణయం తీసుకుంటే సేఫ్ గా బయటకి రాగలం. లేదంటే నష్టం తప్పదు. ఈ నిజం మాస్ మహారాజా రవితేజ గుర్తించినట్టు ఉన్నాడు. శీను వైట్ల దర్శకత్వంలో రవితేజ చేస్తున్న అమర్ అక్బర్ ఆంటోనీ గతంలోనే అక్టోబర్ 5 విడుదల అంటూ మైత్రి సంస్థ అధికారికంగానే ప్రకటించింది. కానీ అనూహ్యంగా విజయ్ దేవరకొండ నోటా అక్టోబర్ 4 వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉండటంతో వెనుకడుగు చేసే ఆలోచనలో  రవితేజ టీమ్ ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్. అధికారికంగా ఖరారు కాలేదు కానీ చర్చ మాత్రం జోరుగా ఉందట.

అయితే ఇది అనుకున్నంత సులువు కాదు. ఎందుకంటే నోటా కోసం వాయిదా వేసుకుని ఓ వారం లేట్ గా వచ్చి పండగ సెలవులను వాడుకుందాం అన్నా 11న జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ వస్తుంది. విజయ్ తోనే పోటీ వద్దనుకున్నప్పుడు యంగ్ టైగర్ ని సవాల్ చేయటం కూడా కరెక్ట్ కాదు. పోనీ మరో వారం చూద్దామా అంటే 17-18 తేదీల్లో పందెం కోడి 2-హలో గురు ప్రేమ కోసమే వస్తున్నాయి. విశాల్ కన్ఫర్మ్ చేసాడు కానీ దిల్ రాజు ఇంకా ప్రకటన చేయాలి. ఇవి కాకుండా పక్క రాష్ట్రాల్లో ఇబ్బంది పెట్టే ధనుష్ వడ చెన్నయ్  కూడా 17 రావడం ఖాయం. ఇంకా లేట్ చేస్తే పండగ సీజన్ పూర్తయిపోయాయి స్కూళ్ళు కాలేజీలు తెరుచుకుని ఓపెనింగ్స్ వీక్ గా వస్తాయి. ఇవన్నీ విశ్లేషించే పనిలో రవితేజ శీను వైట్ల బిజీగా ఉన్నారని సమాచారం. ఫైనల్ బాలన్స్ షూటింగ్ ని హైదరాబాద్ లో పూర్తి చేసి అనుకున్న డేట్ కి వద్దాం అనుకుంటే నోటా చిక్కుతో రవితేజ సినిమా కొంత అయోమయంలో ఉందట. లేదూ ఏదైతే అదయ్యింది అనుకుని పాత  డేట్ కే కట్టుబడతారా వేచిచూడాలి .
Tags:    

Similar News