వచ్చే నెల మొదటి రెండు వారాల్లో చిన్న చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ ముందు క్యూ కడుతున్నాయి. అందులో ఒకటే ‘హుషారు’. శ్రీహర్ష అనే యువ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ ఆసక్తికర విషయాన్ని చెప్పాడు. ఈ చిత్రం కథ విజయ్ దేవరకొండకు నచ్చిందని, ఇందులో విజయ్ దేవరకొండ నటించాల్సి ఉందని పేర్కొన్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో దర్శకుడు శ్రీహర్ష ఆయన పేరు ఎత్తగానే ‘హుషారు’ చిత్రం గురించి చర్చ మొదలైంది.
అసలు విషయం ఏంటీ అంటే.. ‘పెళ్లి చూపులు’ చిత్రం సమయంలో విజయ్ దేవరకొండ వద్దకు పలు చిన్న ప్రాజెక్ట్ లు వచ్చాయట. అవకాశాల కోసం ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ ట్యాక్సీవాలా, ద్వారకా, ఏ మంత్రం వేశావే వంటి చిత్రాలకు ఓకే చెప్పాడు. ఈ మూడు చిత్రాల్లో ట్యాక్సీవాలా మాత్రమే ఆకట్టుకుంది. మిగిలిన రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. పై మూడు సినిమాలతో పాటు ‘హుషారు’ చిత్రం కథను కూడా విజయ్ దేవరకొండ విన్నాడట. కథ బాగా నచ్చినప్పటికి, ఆ చిత్రంలో నలుగురు హీరోలు ఉండనున్నారు.
నలుగురితో కలిసి నటిస్తే గుర్తింపు రాదనే ఉద్దేశ్యంతో హోల్ట్ లో పెట్టాడట. ఆ సమయంలోనే అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ రావడంతో ఇక చిన్న సినిమాల గురించే ఆలోచించలేదు. విజయ్ దేవరకొండ నో చెప్పడంతో కొత్త వారితో శ్రీహర్ష హుషారు చిత్రాన్ని చేశాడు. ఆ రోజున విజయ్ దేవరకొండ ఈ చిత్రానికి ఓకే చెప్పి ఉంటే ‘హుషారు’ హంగామా మామూలుగా ఉండేది కాదు. శ్రీహర్ష జస్ట్ లో విజయ్ దేవరకొండను మిస్ అయ్యాడు. ఈ చిత్రంలో అర్జున్ రెడ్డితో కమెడియన్ గా అలరించిన రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలో నటించాడు. విజయ్ దేవరకొండ మెచ్చిన కథ అంటూ దర్శకుడు శ్రీహర్ష ప్రచారం చేస్తున్న కారణంగా ‘హుషారు’ చిత్రం కాస్త ఫోకస్ లోకి వచ్చి, ఆసక్తి కలిగిస్తుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే డిసెంబర్ 7 వరకు వెయిట్ చేయాల్సిందే.