సినీ పరిశ్రమలో జయాపజయాలన్నవి సహజం. దానికి ఎవ్వరూ అతీతులు కాదు. ఎంత ఊపులో ఉన్న హీరోకైనా ఎక్కడో ఒక చోట ఎదురు దెబ్బ తగులుతుంది. విజయాల్లో ఉన్నపుడు ఎత్తేయడం.. ఒక ప్రతికూల ఫలితం ఎదురవ్వగానే తేల్చి పడేయడం మన దగ్గర మామూలే. ‘అర్జున్ రెడ్డి’.. ‘గీత గోవిందం’ చిత్రాలతో తిరుగులేని విజయాలందుకున్నపుడు విజయ్ దేవరకొండను అందరూ తెగ పొగిడేశారు. కానీ ‘నోటా’ తేడా కొట్టగానే అతడిని తీసి పడేశారు. పైగా విజయ్ తర్వాతి సినిమా ‘ట్యాక్సీవాలా’పై కొన్ని కారణాల వల్ల ముందు నుంచి చాలా నెగెటివిటీ ఉంది. ఈ సినిమా కూడా ఆడటం కష్టమే అని.. విజయ్ స్టార్ డమ్ డ్యామేజ్ కావడం ఖాయమని.. అతనూ అందరిలో ఒకడైపోతాడని ముందే తీర్మానాలు వచ్చేశాయి. కానీ అంచనాలు తలకిందులయ్యాయి.
శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ట్యాక్సీవాలా’ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాపై నెెగెటివిటీ అంతా పక్కకు వెళ్లిపోయింది. నిజానికి అంత నెగెటివిటీలోనూ ‘ట్యాక్సీవాలా’కు బుకింగ్స్ గట్టిగానే జరిగాయి. అక్కడే విజయ్ బాక్సాఫీస్ స్టామినో ఏంటో అందరికీ అర్థమైంది. అతడి ఫాలోయింగ్ ఏమీ తగ్గలేదని తేలింది. ఇక సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో ‘ట్యాక్సీవాలా’ సైతం విజయ్ కెరీర్లో మరో హిట్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. టాక్ ను సద్వినియోగం చేసుకోవడానికి విజయ్ వెంటనే రంగంలోకి దిగిపోయాడు. సాయంత్రం సక్సెస్ వేడుకల్లో పాల్గొన్నాడు. మరోవైపు ఒక కారేసుకుని సామాన్యులకు ట్యాక్సీ సర్వీస్ నడుపుతూ.. దానికి సంబంధించిన వీడియోలతో సినిమాను తనదైన శైలిలో ప్రమోట్ చేస్తున్నాడు. ఇక సినిమాలో విజయ్ పెర్ఫామెన్స్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఒక సాధారణ క్యాబ్ డ్రైవర్ పాత్రలో సులువుగా ఒదిగిపోయాడు. తనదైన శైలిలో అలరించాడు. సినిమాలో మేజర్ హైలైట్లలో విజయ్ పెర్ఫామెన్స్ ఒకటి. మొత్తానికి ‘నోటా’తో వెనుకంజ వేసిన విజయ్.. ‘ట్యాక్సీవాలా’తో పుంజుకుని.. రౌడీ ఈజ్ బ్యాక్ అనిపించాడు.