ఇస్మార్ట్ డైరెక్ట‌ర్ నే క‌థ మార్చ‌మ‌న్నాడా?

Update: 2019-11-30 08:29 GMT
`గీత గోవిందం` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత `ట్యాక్సీవాలా`తో మ‌రో విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. కానీ `డియ‌ర్ కామ్రేడ్` విష‌యంలో తానొక‌టి ఆశిస్తే ఫ‌లితం ఇంకోలా వ‌చ్చింది. ఇది మింగుడు ప‌డ‌ని విజ‌య్ ఆ త‌ర్వాత ఎంతో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో తిరిగి ఫామ్ లోకి వ‌చ్చిన మాస్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తో ఫైట‌ర్ అనే చిత్రానికి స‌న్నాహాలు చేస్తున్నాడు. సేమ్ టైమ్ ఇంద్ర‌గంటి స్క్రిప్టుకి ఓకే చెప్పాడ‌ని ప్ర‌చార‌మైంది.

అయితే ఈ డిసెంబ‌ర్ లో ప్రారంభం కావాల్సిన ఫైట‌ర్ ఎప్పుడు మొద‌ల‌వుతుంది? అన్న‌దానిపై ఇప్ప‌టివ‌ర‌కూ పూరి కానీ విజ‌య్ కానీ ఏ క్లారిటీని ఇవ్వ‌లేదు. దీంతో మ‌రోసారి ఫైట‌ర్ మొద‌లవుతుందా..? ఆల‌స్య‌మ‌వుతుందా? అంటూ సందేహం మొద‌లైంది. ఫైట‌ర్ క‌థాంశం గురించి ఇప్ప‌టికే ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారం ఉంది. ఇందులో విజయ్ 6 ప్యాక్ తో ర‌గ్గ్ డ్ గా క‌నిపిస్తాడ‌ని.. అందుకోసం క‌స‌ర‌త్తులు చేస్తూ లుక్ ఛేంజ్ చేస్తున్నాడ‌ని మార్ష‌ల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాడ‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. అలాగే విజ‌య్ పాత్ర‌లో ఊహించ‌ని ఓ ట్విస్టు ఉంది. అత‌డు మూగ‌వాడిగా క‌నిపించి షాకిస్తాడ‌ని వేరొక ప్రచారం ఊద‌ర‌గొట్టేస్తున్నారు.

అయితే ఇవ‌న్నీ ఊహాగానాలే అనుకుంటే.. అస‌లు ఈ స్క్రిప్టునే మార్చేయాల‌ని పూరికి సూచించాడంటూ మ‌రో ప్ర‌చారం వేడెక్కిస్తోంది. ప్ర‌స్తుతం మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా కిర‌ణ్ కొర్ర‌పాటి కాంబినేష‌న్ లో రూపొందుతున్న‌ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ సినిమా క‌థాంశంతో పోలిక ఉండ‌డంతో స్క్రిప్టును మార్చాల‌ని ఆ ఇద్ద‌రూ భావిస్తున్నార‌ట‌. అయితే ఇది నిజ‌మా కాదా? అన్నది పూరి బృందం రివీల్ చేయాల్సి ఉంటుంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఫైట‌ర్ క‌థానాయిక‌లు ఎవ‌రు? అన్న‌ది పూరి ప్ర‌క‌టించనేలేదు. జాన్వీ క‌పూర్ - కియ‌రా అద్వానీ- న‌భా న‌టేష్ అంటూ ర‌క‌ర‌కాల పేర్లు వినిపించినా కానీ ఎవ‌రినీ ఫైన‌ల్ చేయ‌నేలేదు.


Tags:    

Similar News