ఎక్స్ క్లూజివ్.. విజయ్ దేవరకొండతో తుపాకీ డాట్ కామ్ స్పెషల్ చిట్ చాట్
* గతేడాది గ్యాప్ లేకుండా సినిమాలు ఈ ఏడాది మొత్తానికి రిలీజ్ అవుతున్న ఒకే ఒక్క సినిమా డియర్ కామ్రేడ్ ఈ గ్యాప్ ఎందుకోసం..
పెళ్లి చూపులు తరువాత పర్సనల్ లైఫ్ లేకుండా పోయింది - వరుస హిట్లు - సినిమాలు కారణంగా ఒక్క క్షణం కూడా తీరకలేకుండా గడిపాను - దీనికి తోడు యాడ్ షూట్స్ - బ్రాండ్ ఎండోర్స్ మెంట్స్ ఇలా సాగిపోయింది టైమ్ మొత్తం. నిజానికి లాస్ట్ ఈయర్ నా సినిమాలు ఒకేసారి విడుదలకి రెడీ అవ్వడం వల్ల ప్రతి మూన్నెళ్లకి ప్రేక్షకుల ముందుకి వచ్చాను. ఆ సినిమాలు రిలీజ్ టైమ్ లోనే డియర్ కామ్రేడ్ షూట్ జరుగుతూ ఉండేది.
* గీతగోవిందం రిలీజ్ టైమ్ లో డియర్ కామ్రేడ్ షూట్ తో బిజీగా ఉన్నా అంటున్నారు - అలా చూస్తే ఈ సినిమా షూట్ కి చాలా సమయమే పట్టినట్లుగా ఉంది. ఎందుకలా - రీషూట్స్ కూడా జరిగాయి అంటున్నారు..
నిజానికి ఈ సినిమా కోసం ఎలాంటి రీషూట్స్ చేయలేదు - మా డైరెక్టర్ కి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల షూటింగ్ కంటిన్యూగా చేయలేకపోయాము, అలానే ప్రీ పొడక్షన్ ని కూడా ఎక్కువ టైమ్ తీసుకున్నాము - సౌత్ ఇండియా వైడ్ సినిమా రిలీజ్ ప్లాన్ చేయడం కారణంగా ఆయ పాంత్రాలకి తగ్గట్లుగా ఉండే రీతిన డియర్ కామ్రేడ్ ని రూపొందించడం జరిగింది. మేము ఎక్కడైతే సినిమాని రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యామో అ పాత్ర ప్రజల్ని డియర్ కామ్రేడ్ మెప్పిస్తాడని నమ్ముతున్నా..
* ఇండియా వైడ్ హీరో అవ్వాలని ఏమైనా టార్గెట్స్ పెట్టుకున్నారా - ఎందుకు సడెన్ గా కెరీర్ ఇంకా స్టార్టింగ్ లో ఉండగానే ఇతర భాషల మార్కెట్ కూడా కొట్టాలని డిసైడ్ అయ్యారు..
సినిమా అనేది యూనివర్సల్ అనే విషయం మీకు తెలుసు - ఇక్కడ టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు భాషతో సంబంధం లేకుండా రాణిస్తుంటారు - తెలుగులో నేను నటించిన సినిమాలు వేరే భాషల్లో బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి - నేను ఓ ట్రైల్ వేసి చూద్దాం అనే డియర్ కామ్రేడ్ ని సౌత్ లో ఉన్న నాలుగు భాషల్లో విడుదల చేయడానికి డిసైడ్ అయ్యాము, దీనికి మా నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ కూడా సపోర్ట్ చేశారు.
* రష్మిక మందానకు కన్నడలో ఫాలోయింగ్ ఉందనే ఆమెను డియర్ కామ్రేడ్ లోకి తీసుకున్నారనుకోవచ్చా..
(కొంత సేపు ఆగి) నన్ను కాంట్రవర్శీల్లోకి లాగొద్దు - మీరు అడిగినట్లుగా కన్నడలో ఫాలోయింగ్ ఉందనే తీసుకున్నామనుకుంటే - గీత గోవిందం సినిమాను కూడా కన్నడలో డైరెక్ట్ రిలీజ్ చేయాలిగా - తమిళంలో ఎందుకు రిలీజ్ చేశాము.. (అఫ్ కోర్స్ తమిళంలో గీతగోవిందం తెలుగు రేంజ్ హిట్ అవ్వలేదనుకోండి.. నవ్వులు) కమింగ్ టూ పాయింట్ రష్మిక మందానతో మళ్లీ సినిమా చేయడానికి కారణం - ఆమె డియర్ కామ్రేడ్ కథలో ఉన్న క్రికెటర్ పాత్రకి సరిగ్గా సెట్ అవుతుందనే నమ్మకమే - అలానే రష్మిక మందానకు కూడా ఈ క్యారెక్టర్ నచ్చడంతో వెంటనే ఈ సినిమాలో నటించేందుక ఒప్పుకుంది.
* మీ ఇద్దరిది హిట్ పెయిర్ అనే టాక్ నడుస్తోంది - దాని గురించి ఏమంటారు..
కామన్ ఇవన్నీ - రెండు సినిమాల్లో కలిసి నటిస్తే రూమర్స్ చాలా స్ప్రెడ్ అవుతుంటాయి - అలానే మా మధ్య కూడా వచ్చాయి. వీటి పై స్పందించడానికి ఏముంటుంది..
* రూమర్స్ అని మీరు అన్నారు కాబట్టి - ఓ ఫారిన్ అమ్మాయితో రిలేషన్ లో ఉన్నారనే వార్త నిజమేనా..
రూమర్స్ ని నేను పెద్దగా పట్టించుకోను అని చెప్పాక కూడా మీరు ఈ ప్రశ్న అడిగారు - సరే మీరు అడిగారు కాబట్టి చెబుతున్నా - నేను ఎవ్వరితో రిలేషన్ లో లేను - నాకు అంత టైమ్ లేదు - ఒక వేల ఉంటే మీరు అడిగిన రూమర్స్ అన్ని నిజం చేసేవాడినేమో
* డియర్ కామ్రేడ్ విషయంలో కాస్త ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు ఎందుకలా..
ఎక్కువ కేర్ అంటే ప్రమోషన్స్ గురించి అడుగుతున్నారా( * అదే అనుకోండి.. నవ్వులు).. ప్యాన్ సౌత్ సినిమా కావడంతో ఆయ భాషల్లో ప్రేక్షకులకి నేను కొత్త వాడినవ్వడం - వారిని ఎట్రాక్ట్ చేసేందుకు ఈ డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్ట్ లు పెట్టాము - ఈ ఫంక్షన్స్ కు మేము అనుకున్నదానికి కంటే ఎక్కువ రెస్పాన్స్ రావడం నాకు మంచి ఎనర్జీని ఇచ్చింది..
* డియర్ కామ్రేడ్ తో ప్యాన్ ఇండియా హీరో అయిపోయారు - మరి వేరే భాషల్లో డైరెక్ట్ సినిమాలు కూడా చేస్తారా..
ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు లేవు - మన తెలుగులో నా కెరీర్ హాయిగా సాగిపోతుంది. కనీసం యావరేజ్ వచ్చినా ఫ్లాప్ గానే లెక్కేసుకునే నాకు అలాంటి సందర్భాలు పెద్దగా రావడం లేదు(* నోటా ఉందిగా అనేలోపే..) అదే నోటా ఉంది అందుకే పెద్దగా ఆందోళన పడే సందర్భాలు రావడం లేదంటున్నా..
* డియర్ కామ్రేడ్ లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది..
ఇంత సేపు డియర్ కామ్రేడ్ గురించే అడుగుతున్నట్లు ఉంది కానీ నాకు వేరే ప్రశ్నలకు సమాధానం చెబుతున్నట్లు ఉంది. హమ్మయ్య సూటిగా డియర్ కామ్రేడ్ గురించి అడిగారు.. ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే మీకు అర్ధమై ఉంటుంది. కాస్త ఎగ్రేసివ్ నేచర్ ఉన్న ఓ కుర్రాడు కథ ఇది - ఆ ముక్కు సూటిగా వెల్లే నేచర్ వల్ల వాడికి వచ్చే లాభ నష్టాలే మా డియర్ కామ్రేడ్. ఓ కొత్త పాయింట్ ని ఈ సినిమాలో టచ్ చేశాం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సినిమా సెకండాఫ్ లో వచ్చే ఎమోషన్ సీన్స్ అందర్నీ ఆకట్టకుంటాయి అని నేను చాలా బలంగా నమ్ముతున్నా..
* డియర్ కామ్రేడ్ కూడా వంద కోట్లు క్లబ్ లో చేరుతుందా..
నేను నటించే ఏ సినిమా కి ఇంత కలెక్షన్స్ అంత కలెక్షన్స్ రావాలని నేను ఎప్పుడూ కోరుకోను - హిట్ అవ్వాలి అని మాత్రం అనుకుంటాను - ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేస్తున్నానా లేదా అన్నది చాలా ఫ్లాగ్ షిప్ ఎజెండా..
* డియర్ కామ్రేడ్ తో మరో హిట్ మీరు అందుకోవాలని తుపాకీ డాట్ కామ్ కోరుకుంటుంది
ఆల్ మై డియర్ కామ్రేడ్ రీడర్స్ - ప్లీజ్ థియేటర్ కి వెళ్లి మీ డియర్ కామ్రేడ్ ని చూడండి - చాన్నాళ్ల తరువాత పైరసీ కాకుండా నా సినిమా డైరెక్ట్ గా థియేటర్ లో రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ గో అండ్ వాచ్ డియర్ కామ్రేడ్.. (నవ్వులు)
థ్యాంక్యూ