ఇంటిదొంగల బెడదతో టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఇబ్బందిపడుతోన్న సంగతి తెలిసిందే. ‘అరవింద సమేత వీర రాఘవ’ - గీత గోవిందం` లీకుల వ్యవహారం ఇండస్ట్రీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘ట్యాక్సీవాలా’ హెచ్ డీ ప్రింట్ ఆన్ లైన్ లో ప్రత్యక్షమవడంతో చిత్ర నిర్మాతలు షాకయ్యారు. ఆ వ్యవహారం పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెల్ల కమల్ - భార్గవ్ కుమార్ - బీఆర్ పేర్లతో ఉన్న జీ–మెయిల్ ఐడీల డ్రైవ్ అకౌంట్ల ద్వారా లింకులు షేర్ అవుతున్నాయని నిర్మాతలు.....పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆ లీకు వీరులను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో వారు దొరికారని - దేవరపల్లిలో టాక్సీవాలా నిర్మాతలు - పోలీసులు ఈ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు వెల్లడిస్తారని తెలుస్తోంది.
`గీత గోవిందం` సినిమా లీకేజీ సమయంలో నే టాక్సీవాలా సినిమా లీకవడం చర్చనీయాంశమైంది. వాస్తవానికి గీత గోవిందం కన్నా ముందే టాక్సీవాలా విడుదల కావాల్సి ఉంది. సిజి వర్క్ ఔట్ పుట్ బాగా లేక పోవడంతో మరో సంస్థతో చేయించడం వల్ల లేటయింది. దీంతో, గీత గోవిందం ముందుగా విడుదలైంది. ఆ తర్వాత`నోటా`విడుదల చేద్దామని విజయ్....కోరాడట. అన్నీ సిద్ధమనుకున్న సమయవక్ష పైరసీ బెడదతో విడుదల లేట్ అవుతోందట. దాదాపుగా టాక్సీవాలా మొత్తం సినిమా ఆన్ లైన్ లోకి వచ్చేసిందట. అయితే, లీకైన 4 గంటల రా ఫుటేజ్ లో డైలాగులు - రీ రికార్డింగ్ - సిజి లు లేకపోవడం వల్ల నిర్మాతలు కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారట. ఏది ఏమైనా....ఇప్పటికే లేటైన విడుదలకు ఈ లీకుల బెడద తోడవడంతో యూవీ క్రియేషన్స్ వారు అన్ లక్కీ అనే చెప్పాలి. మరి, ఈ విఘ్నాలన్నీ దాటుకొని `టాక్సీవాలా`ఎపుడు వస్తాడో వేచి చూడాలి.