ఇప్పుటి క్రేజీ హీరో.. నెక్స్ట్ సూపర్ స్టార్?

Update: 2018-11-27 05:56 GMT
టాలీవుడ్ లోకి కొత్త హీరోలు చాలామందే ఎంట్రీ ఇస్తుంటారు. ఐదేళ్ళు.. పదేళ్ళు దాటినా వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారని ఇండస్ట్రీలోని జనాలే సరిగా గుర్తించరు.  కానీ విజయ్ దేవరకొండ రూటే వేరు.. తక్కువ సమయంలో విభిన్నమైన సబ్జెక్టులు ఎంచుకొని హిట్స్ సాధించాడు.  యాక్టింగ్ స్కిల్స్.. యునీక్ యాటిట్యూడ్ తో తెలుగు యూత్ కు ఫేవరేట్ హీరోగా మారిపోయాడు.

ఈమధ్య విజయ్ క్రేజ్ తెలుగులోనే కాకుండా ఇతర భాషల ఆడియన్స్ లో కూడా పెరిగింది.. మెల్లగా అది బాలీవుడ్ నటుల వరకూ చేరింది.  గతంలో హిందీ హీరోయిన్లను మీ ఫేవరేట్ తెలుగు హీరో ఎవరు అంటే మహేష్ బాబు పేరు చెప్పేవారు. బాహుబలి తర్వాత ప్రభాస్ పేరు చెప్తున్నారు.  ఈమధ్య శ్రీదేవి కుమార్తె జాన్విని మీరు ఒక్కరోజు ఏదో ఒక హీరోలా ఉండే అవకాశం వస్తే ఎవరిలా ఉంటారని కాఫీ విత్ కరణ్ షో లో అడిగితే.. విజయ్ దేవరకొండ లా ఉంటానని.. నెక్స్ట్ సినిమాకు హీరోయిన్ గా జాన్విని తీసుకుంటాని చెప్పింది.  మహేష్.. ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా అప్పీల్ ఉన్న సూపర్ స్టార్లను కాదని విజయ్ పేరు చెప్పడం విశేషమే.  

ఇదే కాకుండా ఒక పోల్ లో మోస్ట్ డిజైర్డ్ మ్యాన్ గా కూడా ఈమధ్య విజయ్ దేవరకొండ ఎంపికయ్యాడు. ఇవన్నీ ప్రస్తుతం విజయ్ దేవరకొండ క్రేజ్స్ కు శాంపిల్సే.  కానీ ఈ క్రేజీ హీరో ఫ్యూచర్ లో మహేష్.. ప్రభాస్ ల మాదిరిగా ఒక సూపర్ స్టార్ గా మారతాడా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి.
    

Tags:    

Similar News