టాలీవుడ్ లో ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన యంగ్ హీరోగా విజయ్ దేవరకొండ కనిపిస్తాడు. రావడం రావడంతోనే తెరపైకి ఒక ఉప్పెనలా ఉరికొచ్చాడు .. కుర్రాళ్లకు రోల్ మోడల్ గా నిలిచాడు. లుక్ పరంగానూ .. యాక్టింగ్ పరంగాను ఒక కొత్త ట్రెండ్ ను సెట్ చేసి పెట్టాడు. కుర్రాడిలో యాక్షన్ పాళ్లు మాత్రమే కాదు, రొమాంటిక్ పాళ్లు కూడా పుష్కలంగా ఉన్నాయనే విషయం 'గీత గోవిందం' సినిమాతో అర్థమైపోయింది. అలా యూత్ తో పాటు మాస్ ఆడియన్స్ ను కూడా తనచుట్టూ తిప్పుకుంటున్న విజయ్ దేవరకొండ, తన తాజా చిత్రంగా 'లైగర్' చేస్తున్నాడు.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్ కి తగిన రొమాంటిక్ యాక్షన్ మూవీగానే ఆయన చిత్రీకరిస్తున్నాడు. ఈ సినిమాలో 'అనన్య పాండే' హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో ఆమెకి ఇదే తొలి సినిమా. అసలే బాలీవుడ్ పిల్ల .. ఒక వైపున రొమాంటిక్ దర్శకుడు .. మరో వైపున రొమాంటిక్ హీరో .. కథలో రొమాన్స్ పర్సెంటేజ్ ఎక్కువ. అందువలన అప్పుడే కుర్రాళ్లు నానారకాలుగా ఊహించేసుకుని ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను త్వరలో విడుదల కానున్న ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
విజయ్ దేవరకొండకిగల క్రేజ్ కారణంగా నిర్మాతలు బడ్జెట్ విషయంలో వెనకాడకపోవడంలో అర్థం ఉంది. అలాగే భారీస్థాయిలో విడుదల చేయడంలోను అర్థం ఉంది. అయితే ఆ క్రేజ్ ను .. మార్కెట్ ను నిలబెట్టుకోవలసిన బాధ్యత మాత్రం విజయ్ దేవరకొండపైనే ఉంది. క్రేజ్ .. మార్కెట్ వాల్యూ ఎప్పుడూ ఒకేలా ఉండవు .. హిట్ పడకపోతే అవి పల్స్ రేటుకన్నా దారుణంగా పడిపోతాయి. అందుకోసమే ఇక్కడ హిట్టుకోసం ఒట్టుపెట్టుకు కూర్చుంటారు. అలాంటి హిట్ విజయ్ దేవరకొండకి పడక చాలాకాలమే అయింది. 'డియర్ కామ్రేడ్' .. 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలు ఆయన అభిమానులను చాలా నిరాశపరిచాయి. అందువలన ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాల్సిందే బాసూ అంటూ ఆయనకి తమ మనసులోని మాటను చెప్పుకుంటున్నారు. ఈ ఏడాది ఈ రౌడీ హీరో థియేటర్ నుంచి హిట్టు పట్టుకునే ఇంటికి వెళతాడేమో చూడాలి.