విజయ్ దేవరకొండ నటించిన లైగర్ ఆగస్ట్ 25 గురువారం నాడు అభిమానుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. ఇందులో దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ అతిథి పాత్రలో కనిపించాడు. ది బ్యాడెస్ట్ మ్యాన్ ఆన్ ది ప్లానెట్.. ట్రైలర్ లోను ఎలివేట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక మైక్ టైసన్ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు తనని సరదాగా దుర్భాషలాడాడని విజయ్ తాజా మీడియా చాటింగ్ లో వెల్లడించాడు.విజయ్ దేవరకొండ మైక్ టైసన్ తో కొన్ని పోరాట సన్నివేశాల్లో నటించాడు. దీని కోసం తనని తాను మార్చుకునేందుకు అలాగే ఫైట్స్ నేర్చుకోవడానికి దాదాపు రెండేళ్లపాటు శిక్షణ తీసుకున్నాడు.
ఇటీవలి ఇంటర్వ్యూలో సినిమా సెట్స్ లో దిగ్గజ బాక్సర్ తనను సరదాగా దుర్భాషలాడాడని రౌడీ వెల్లడించాడు. టైసన్ తో కలిసి పని చేయడం సరదాగా ఉంటుందని అతడు మంచి వ్యక్తి అని కితాబిచ్చారు. టైసన్ నన్ను చాలా ప్రేమగా ఇంగ్లీష్ లో దుర్భాషలాడాడు. అతను నాతో అన్నవి పునరావృతం చేయలేను. నేను అతనితో మంచి సమయాన్ని గడిపాను అని దేవరకొండ చెప్పాడు.
మైక్ టైసన్ కి భారతీయ ఆహారం సంగీతం అంటే చాలా ఇష్టం అని విజయ్ దేవరకొండ తెలిపారు."దిగ్గజ బాక్సర్ అయితే ఇక్కడి జనాలను చూసి భయపడతాడు. ఆహారం సంగీతం పరంగా భారతదేశాన్ని చాలా ప్రేమిస్తారు. నిజానికి అతను చాలా ఆనందించే భారతీయ ఆహారాన్ని తీసుకురావాలని అతను మమ్మల్ని అడిగేవాడు. కానీ ఇక్కడ జనాలను చూసి టైసన్ నిజంగానే భయపడ్డాడు" అని అతను చెప్పాడు.
లైగర్ అనేది స్పోర్ట్స్ డ్రామా.. ఇందులో విజయ్ దేవరకొండ మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) ఫైటర్ పాత్రలో కనిపించాడు. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు. తెలుగు-హిందీ ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ మూవీ విజయ్ కి బాలీవుడ్ ఆరంగేట్ర చిత్రం. లైగర్ కి ఉన్న నత్తి అనే సమస్య ప్రధాన హైలైట్ గా నిలిచింది.
రొమాంటిక్ డ్రామా గెహ్రైయాన్ లో చివరిగా కనిపించిన అనన్య పాండే ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. లైగర్ లో రమ్య కృష్ణన్ - రోనిత్ రాయ్ - మకరంద్ దేశ్ పాండే తదితరులు కీలక పాత్రలు పోషించారు. రమ్యకృష్ణ ఈ చిత్రంలో'మదర్ ఆఫ్ ది లైగర్' పాత్రను పోషించారు. ఈ చిత్రానికి సీక్వెల్ వచ్చే అవకాశం ఉందని విజయ్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.