గుండె జారిన దర్శకుడికి లైలా దొరికింది

Update: 2017-03-03 04:03 GMT
దర్శకుడు కొండా విజయ్ కుమార్ కి టాలీవుడ్ మంచి లాంఛింగే దొరికింది. గుండె జారి గల్లంతయిందే అంటూ నితిన్ మాంచి హిట్ సాధించాక.. మరుసటి ఏడాది 2014లో నాగచైతన్యతో చేసిన ఒక లైలా కోసం రూపంలో ఫ్లాప్ ఎదురైంది. ఆ తర్వాత మరో సినిమా ఇంకా మొదలుపెట్టలేదు కానీ.. తీవ్ర ప్రయత్నాల్లోనే ఉన్నాడు.

ఇప్పుడీ గుండె జారిన గల్లంతైన దర్శకుడు కొండా విజయ్ కుమార్.. తన జీవిత భాగస్వామిని ఎంచుకోవడమే కాదు.. పరిణయం ఆడేశాడు కూడా. మార్చ్ 1వ తేదీన వధువు ప్రసూనతో ఇతని వివాహం ఘనంగా జరిగింది. హైద్రాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో విజయ్ కుమార్- ప్రసూనల వివాహం జరింది. ఈ కార్యక్రమానికి.. టాలీవుడ్ నుంచి పలువురు సన్నిహితులు హాజరయ్యారు. పెళ్లి చేసుకుని లైఫ్ కి టర్నింగ్ ఇచ్చేసుకున్న ఈయన..  ఇక డైరెక్టర్ గా తన ప్రయత్నాలను కూడా లైన్ లో పెట్టేశాడు.

మెగా హీరో వరుణ్ తేజ్ తో ఇప్పటికే ఓ మూవీకి ఓకే అనిపించుకున్నాడనే టాక్ ఉంది. నాగబాబు కూడా సై అనడంతో.. ప్రస్తుతం వరుణ్ తేజ్ చేస్తున్న ఫిదా పూర్తవగానే కొండా విజయ్ కుమార్ తో చేసే సినిమాపై అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News