మనదేశంలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి అత్యధికంగా పెరుగుతుంది. ఈ కరోనాను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం - రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కలిసి మే 3 వరకు లాక్ డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. కరోనా దెబ్బతో ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయి సతమతమవుతున్నారు. దేశంలో ఆర్థిక వ్యవస్థలన్నీ ఒక్కసారిగా స్థంభించి నష్టాల్లో కురుకుపోతున్నాయి. ముఖ్యంగా వేసవి కాలం వచ్చిందంటే ప్రజలందరికి సినిమాలతో మస్త్ టైంపాస్ అవుతుంది. అదే సినీ ఇండస్ట్రీ ఇప్పుడు థియేటర్లు మూసివేసి సైలెంట్ అయింది.
ఈ సమ్మర్‌లో సీజన్ లో విడుదల కావాల్సిన సినిమాల జాబితా పెద్దగానే ఉంది. కానీ కరోనా కారణంగా అన్నీ వాయిదా పడ్డాయి. మే కూడా పోతే సినిమా ఇండస్ట్రీకి నష్టం భారీ స్థాయిలో ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ మాత్రం తను తాజాగా నటించిన 'మాస్టర్' సినిమాను ఖచ్చితంగా విడుదల చేస్తానంటున్నాడట. విజయ్ హీరోగా విజయ్ సేతుపతి ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన 'మాస్టర్' సినిమా ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతుంది.
అయితే విజయ్ కి తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మాస్టర్ ని తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉండగా జూన్ 22న ఇళయదళపతి విజయ్ పుట్టినరోజు కావడంతో ఆ స్పెషల్ రోజునే సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలనీ చిత్రయూనిట్ భావిస్తున్నారట. నిజానికి మాస్టర్ సినిమా ఏప్రిల్ 9న తెలుగు - తమిళ భాషల్లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ లాక్ డౌన్ కారణంగా రిలీజ్ వాయిదా పడింది. చూడాలి మరి మాస్టర్ విజయ్ జూన్ 22న థియేటర్లలో కనువిందు చేస్తాడేమో..!