'న‌వాబ్' వ‌ల‌చిన‌ 'స‌ర్కార్‌'

Update: 2018-10-16 01:30 GMT
ద‌ర్శ‌క దిగ్గ‌జం మ‌ణిర‌త్న ం రూపొందించిన `న‌వాబ్‌` ఇటీవ‌లే రిలీజైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌మిళ‌నాడు, ఓవ‌ర్సీస్‌లో చ‌క్క‌ని వ‌సూళ్లు సాధించినా తెలుగులో మాత్రం ప‌రాజ‌యం పాలైంది. కంటెంట్ బావున్నా ఈ సీరియ‌స్ డ్రామాని మ‌న‌వాళ్లు వోన్ చేసుకోలేక‌పోయారు. స‌మీక్ష‌కులు పెద‌వి విరిచేయ‌డం ఈ సినిమాకి పెద్ద మైన‌స్ అయ్యింది. అయితే ఈ మూవీని రిలీజ్ చేసిన తెలుగు డిస్ట్రిబ్యూట‌ర్ కం నిర్మాత వ‌ల్ల‌భ‌నేని అశోక్‌ మ‌రో క్రేజీ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌నున్నార‌ని తెలుస్తోంది.

ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ - ఏ.ఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్ మూవీ `స‌ర్కార్‌` తెలుగు రైట్స్‌ని వ‌ల్ల‌భ‌నేని  ద‌క్కించుకుని రిలీజ్ చేయ‌నున్నారు. భారీ పోటీ మ‌ధ్య ఫ్యాన్సీ ధ‌ర‌కు రైట్స్‌ని ఛేజిక్కించుకున్నార‌ని తెలుస్తోంది. ఇక ప్ర‌యోగాలు చేయాల‌న్నా.. సామాజికాంశాల్ని ట‌చ్ చేస్తూ క‌మ‌ర్షియ‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్లు కొట్టాల‌న్నా మురుగ‌దాస్ త‌ర్వాతే. అత‌డు విజ‌య్‌తో క‌లిసి చేసిన ప్ర‌యోగాల‌న్నీ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌. తుపాకి - క‌త్తి ఘ‌న‌విజ‌యాలు సాధించాయి. అందుకే ప్ర‌స్తుతం టాలీవుడ్‌లోనూ విజ‌య్ స‌ర్కార్ గురించి చ‌ర్చ సాగుతోంది.

విజయ్ న‌టించిన గ‌త చిత్రం `మెర్స‌ల్` తెలుగులో `అదిరింది` పేరుతో రిలీజై విజ‌యం సాధించింది. ఆ క్ర‌మంలోనే తెలుగు లో మార్కెట్ పెంచుకునే వ్యూహంలోనూ ఉన్నాడు. మురుగ‌దాస్‌కి ఉన్న ఇమేజ్ దృష్ట్యా స‌ర్కార్ కి మార్కెట్‌లో గ్రిప్ ఉంటుంద‌ని భావిస్తున్నారు.  విజ‌య్ హీరోగా తుపాకి - క‌త్తి  వంటి విజయవంతమైన చిత్రాల త‌ర్వాత మురుగ‌దాస్‌ రూపొందిస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్‌ - వరలక్ష్మి శరత్ కుమార్ - కథానాయికలుగా న‌టిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లో కళానిథి మారన్‌ నిర్మిస్తున్నారు. స‌ర్కార్‌ ఫస్ట్‌లుక్‌ కి - పాటలకు త‌మిళంలో స్ప ంద‌న బావుంది.  ప్రస్తుతం తెలుగు అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించనున్నార‌ని తెలుస్తోంది. దీపావళి కానుకగా నవంబర్‌ 6న  ప్రపంచ వ్యాప్తంగా మూవీ విడుదల కానుంది. ఈ క్రేజీ చిత్రానికి రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు.
Tags:    

Similar News