ప‌వ‌ర్ స్టార్ ఫాలోయింగ్ రేంజెంతో తెలిపే ఇన్సిడెంట్!

Update: 2020-09-18 07:00 GMT
టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. జ‌న‌సేనానిగా రాజ‌కీయాల్లోకి వచ్చినా తిరిగి సినిమాలు చేస్తూ అభిమాన గ‌ణంలో త‌న ఇమేజ్ ఏమాత్రం త‌గ్గ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. ఇక ప‌వ‌న్ ఏ పొలిటిక‌ల్ స‌భ‌ల‌కు వెళ్లినా అక్క‌డ ఊక‌వేస్తే రాల‌నంత మంది జ‌నం హాజ‌ర‌వుతుండ‌డం చూస్తున్న‌దే.

అటు కోలీవుడ్ లోనూ భారీ ఫాలోయింగ్ ఉన్న ప‌వ‌ర్ స్టార్ ఎవ‌రు? అంటే క‌చ్ఛితంగా ఇల‌య ద‌ళ‌పతి విజయ్ గురించే చెబుతారు. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌ర్వాత ఆయ‌న హ‌వా ఆ రేంజులో సాగుతోంది. అత‌డు ఎక్క‌డికి వెళ్లినా ఊక వేస్తే రాల‌నంత జ‌నం చేరుకుని షాక్ లిస్తుంటారు. ఇక‌ సోషల్ మీడియా లో స్పీడ్ గా ఉండేవారికి విజ‌య్ క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. అయితే ద‌ళ‌పతి విజయ్ సోషల్ మీడియాలో ఉన్నప్పటికీ ఇత‌ర వ్యాప‌కాల‌తో బిజీ కాబ‌ట్టి అత‌డు అక్క‌డ‌ చాలా తక్కువగానే ట‌చ్ లో ఉంటారు.

ఇక విజ‌య్ ఎంత స్లోగా ఉన్నా ఆయ‌న ట్విట్ట‌ర్ ఖాతా నుంచి ఒక ట్వీట్ పెడితే చాలు గంటల్లోనే లక్షలాది లైకులు రీట్వీట్లు వ‌చ్చేస్తాయి. తాజాగా విజయ్ షేర్ చేసిన ఒక సెల్ఫీ ట్వీట్ ను ఇండియాలోనే దిబెస్ట్ రీట్వీటెడ్ ట్వీట్ గా రికార్డులు బ్రేక్ చేస్తోంది. మాస్ట‌ర్ లొకేష‌న్ నుంచి దీనిని విజ‌య్ షేర్ చేశారు. అక్క‌డ ఆయ‌న‌ను వీక్షించేందుకు ఆ రేంజులో అభిమానులు చేరుకున్నార‌ట‌. ఈ సెల్ఫీని ట్విట్టర్ ఖాతా ద్వారా  ఫిబ్రవరిలో షేర్ చెసారు. దానికి ఇప్పటికి 3 లక్షల 58 వేల లైక్స్ ఒక లక్ష 30వేలకు పైగా రీట్వీట్స్ రావడంతో మన ఇండియాలోనే రికార్డు రీట్వీట్ గా వైర‌ల్ అయిపోతోంది. ఒక ట్వీట్ కి రీట్వీట్ రావ‌డంలో ఇదే సరికొత్త రికార్డు అని చెబుతున్నారు.
Tags:    

Similar News