సేతుపతి బాలీవుడ్ మూవీ స్టార్టయ్యింది

Update: 2022-03-12 00:30 GMT
కొన్ని కాంబినేషన్లను మనం ఊహించం. కానీ అవి అలా సెట్టవుతాయంతే. అలాంటి కాంబోనే ఒకటి బాలీవుడ్‌లో కుదిరింది. విజయ్‌ సేతుపతికి జోడీగా కత్రినా కైఫ్ నటించబోతోంది. డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ డైరెక్షన్‌లో 'మెర్రీ క్రిస్మస్‌' అనే మూవీ కోసం ఈ జోడీ ఫిక్సయ్యింది.

 రమేష్ తురానీ నిర్మిస్తున్న ఈ మూవీ అనౌన్స్‌మెంట్ పోయినేడు డిసెంబర్‌‌లోనే వచ్చింది. షూటింగ్ వెంటనే స్టార్ట్ చేయాలనుకున్నా అయితే అప్పటికి థర్డ్ వేవ్‌ మొదలు కావడంతో వీలుపడలేదు. ఆ తర్వాత కత్రినా తన పెళ్లి పనుల్లో పడిపోవడంతో ఇంకాస్త టైమ్ పట్టింది. ఎట్టకేలకి ఇప్పుడు షూటింగ్ మొదలయ్యింది. ఆ విషయాన్ని కత్రినాయే స్వయంగా కన్‌ఫర్మ్ చేసింది.

 ఈ మూవీ కోసం ఇద్దరి ఫ్యాన్స్ చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. కత్రినా గ్లామర్‌‌.. సేతుపతి వెరటైల్‌ యాక్టింగ్‌.. రెండూ కలిస్తే ఎలా ఉంటుందో చూడాలని ఆశపడుతున్నారు. దానికి తోడు శ్రీరామ్ రాఘవన్ టేకింగ్ స్టైల్‌ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది.

ఏక్‌ హసీనా థీ, అంధాధున్ లాంటి చిత్రాలతో రచయితగా, దర్శకునిగా సత్తా చాటాడు శ్రీరామ్. అతనికి విజయ్ సేతుపతి లాంటి వెర్సటైల్‌ దొరికాడంటే ఆ మూవీ అదిరిపోతుందని అందరి అంచనా. దీంతో పాటు 'ముంబైకార్' అనే మరో మూవీలోనూ సేతుపతి యాక్ట్ చేస్తున్నాడు. ఆల్రెడీ సౌత్‌లో చక్రం తిప్పుతున్నాడు. వెంటవెంటనే రెండు సినిమాలు చేస్తున్నాడంటే బీటౌన్‌లోనూ జెండా పాతేస్తాడేమో.
Tags:    

Similar News