కేరళలో పరిస్థితి చాలా సెన్సిటివ్ గా ఉంది. అక్కడ ఏం మాట్లాడితే ఎలాంటి అర్థాలు వస్తాయో తెలియక సెలబ్రెటీలు ప్రతి విషయంపై కూడా ఆచితూచి మాట్లాడుతున్నారు. శబరిమల విషయంలో కేరళలోని హిందువులు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. కేరళ సీఎం విజయన్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహంగా ఉన్నారు. అలాంటి విజయన్ పై ఎవరు కాస్త పాజిటివ్ గా మాట్లాడినా కూడా వారిని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా తమిళ హీరో విజయ్ సేతుపతి కేరళ సీఎంను పొగిడి చిక్కుల్లో పడ్డాడు.
తమిళనాట అనూహ్యంగా విజయ్ సేతుపతి స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా, చాలా కష్టపడి విజయ్ సేతుపతి ఈ స్థాయికి వచ్చాడు. తమిళనాడులోనే కాకుండా కేరళ మరియు తెలుగు రాష్ట్రాల్లో కూడా విజయ్ సేతుపతిని అభిమానించే వారు ఉన్నారు. వివాదాలకు ఆమడ దూరంలో ఉండే విజయ్ సతేపతి అనుకోకుండా వివాదంలో చిక్కుకున్నాడు.
విజయ్ ఒక సినిమా షూటింగ్ కోసం కేరళ వెళ్లాడు. అక్కడ స్థానిక మీడియాతో మాట్లాడిన సందర్బంగా తనకు కేరళ సీఎం విజయన్ గారు అంటే చాలా గౌరవం అని, ఆయన తీసుకున్న నిర్ణయాలు అభినందనీయం అన్నాడు. శబరిమల విషయంలో విజయన్ తీరును విజయ్ సేతుపతి సమర్ధించాడు అంటూ కేరళ మరియు తమిళనాడులో విజయ్ సేతుపతికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి.
ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రంకు వెళ్లినప్పుడు మీడియాతో మాట్లాడిన సమయంలో ఆ రాష్ట్రం సీఎం గురించి ఎవరైనా పాజిటివ్ గానే మాట్లాడతారు. అలాగే విజయ్ సేతుపతి కూడా సీఎం విజయన్ గురించి అలా మాట్లాడి ఉండవచ్చు. అంతే తప్ప ఆయన మరే ఉద్దేశ్యంతో ఆయను పొగిడి ఉండదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో విజయ్ సేతుపతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోస్ట్ లు పడుతున్నాయి. మరి ఆ పోస్ట్ లకు విజయ్ సేతుపతి ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.