తమిళ స్టార్ హీరో విజయ్ కి తమిళనాట వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన సినిమా వస్తోందంటే చాలు తమిళనాట అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. తమ హీరో కోసం సోషల్ మీడియా వేదికగా గత కొంత కాలంగా ఓ రేంజ్ లో రచ్చ చేస్తున్న విజయ్ ఫ్యాన్స్ ఈ సంక్రాంతికి విజయ్ `వారీసు` మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. `బీస్ట్` తరువాత విజయ్ నటిస్తున్న సినిమా ఇది.
`బీస్ట్` ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోవడం, తొలి సారి తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి, తెలుగు నిర్మాత దిల్ రాజు తో కలిసి చేస్తున్న సినిమా కావడంతో అందరి దృష్టి ఈ ప్రాజెక్ట్ పై పడింది. తమిళంలో `వారీసు`గా, తెలుగులో `వారసుడు`గా పొంగల్ బరిలో దిగుతున్న ఈ మూవీ తెలుగు , తమిళ రాష్ట్రాల్లో థియేటర్ల వివాదం కారణంగా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ కు సమయం దగ్గరపడుతున్న వేళ దిల్ రాజు ప్రమోషన్స్ ని జోరుగా మొదలు పెట్టారు.
ఇందులో భాగంగా డిసెంబర్ 24న శనివారం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. దాదాపు రెండేళ్ల విరామం తరువాత విజయ్ పబ్లిక్ ఈవెంట్ లో పాల్గొంటుండటంతో ఈ ఈవెంట్ కి అభిమానులు భారీ స్థాయిలో హాజరయ్యారు. ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్న అభిమానులు ఊహించని విధంగా ప్రీ రిలీజ్ వేడుక జరుగుతున్న ప్రాంగణానికి తండోప తండాలుగా వచ్చేశారు. దీంతో వారిని కంట్రోల్ చేయడం పోలీసు వారికి ఇబ్బందికరంగా మారింది.
ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రాంగణంలోకి వెళ్లడానికి ఫ్యాన్స్ భారీగా విరుచుకుపడ్డారు. దీంతో వారిని అదుపే చేయడానికి పోలీసులు భారీగానే ప్రయత్నించారు. అయితే ఒక్కసారిగా వందల సంఖ్యలో ఫ్యాన్స్ విరుచుకుపడటంతో పోలీసులు అదుపు చేయలేకపోయారు. ఈ దశలో అడ్డుగా వున్న పోలీస్ సిబ్బందిని సైతం తోసుకుంటూ అభిమానులు లోనికి వెళ్లేందుకు పరుగులు పెట్టారు. దీంతో వారికి ఎదురుగా వున్న కొంత మంది పోలీస్ సిబ్బంది కిందపడిపోయి తొక్కీసలాటకు గురయ్యారు.
ఇందులో ఓ పోలీస్ కానిస్టేబుల్ కు గాయాలు కాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఈ విషయం తెలిసిన నిర్వాహకులు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఫ్యాన్సే జాగ్రత్త పడాలని, మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానుల్ని కోరారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.