దాదాపు 15ఏళ్ల విరామం అనంతరం `సరిలేరు నీకెవ్వరు` సినిమాతో విజయశాంతి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రొఫెసర్ భారతి పాత్రలో దేశం కోసం వారసుల్ని త్యాగం చేసిన మాతృమూర్తిగా నటించారు. విజయశాంతికి పర్ పెక్ట్ కంబ్యాక్ మూవీ అనే చెప్పాలి. సినిమా జయాపజయాలతో పని లేకుండా లేడీ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. భారతి పాత్రకు తను తప్ప మరొకరు న్యాయం చేయలేరు అన్న ప్రశంసలు కురిపించారు. బహుశా అందుకేనేమో దర్శకుడు అనీల్ రావిపూడి వెంటపడి మరీ ఒప్పించాడు. రాములమ్మగా పొలిటికల్ బరిలో.. లేడీ బాస్ గా సినిమాల్లో రాణించాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.
అయితే కంబ్యాక్ మూవీ కావడంతో రాములమ్మకు సరిలేరు టీమ్ భారీ పారితోషికం దాంతో పాటే ఇతరత్రా సౌకర్యాలు కల్పించారు. కాలు కింద పెట్టకుండా రాణమ్మలా చూసుకున్నారు అనీల్ రావిపూడి టీమ్. సకల సౌకర్యాల్ని తనకోసం ఆన్ లొకేషన్ కే అందుబాటులోకి తెచ్చారని అప్పట్లో ప్రచారమైంది. దాదాపు 2కోట్ల పారితోషికాన్ని నిర్మాతలు సమర్పించుకున్నారని ప్రచారమైంది. ఇక ప్రచారం పరంగానూ గౌరవం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు అదే ఫార్ములా ఇతరులకు వర్తిస్తుందని విజయశాంతి చెబుతున్నారట. ఇకపై రెగ్యులర్ గా కమిట్లకు సరిలేరు రేంజ్ ట్రీట్ కావాలని కండీషన్లు పెడుతోందిట. ఏ సినిమాకు సంతకం చేసిన తన పాత్ర కు ఎక్కువ ప్రాముఖ్యత ఉండాలని ముందే చెబుతున్నారు. పైగా ప్రచారంలో తానే హైలైట్ కావాలన్నది మరో కండిషన్.
పారితోషికంలోనూ ససేమిరా అనేస్తోందట. 2 కోట్లు పారితోషికం ముట్టజెప్పాల్సిందే. మరి రాములమ్మ కండీషన్ల కు ఇతరుల సన్నివేశమేమిటో! దర్శక రచయితలు తమ పరిధిలో తనకోసం మంచి పాత్ను క్రియేట్ చేయొచ్చు కానీ.. పారితోషికంతో పాటు ఇతర సౌకర్యాల విషయంలో డిమాండ్లకే ఎందరు ఓకే అవుతారు? అన్నది చూడాలి. క్రేజు డిమాండును బట్టి పారితోషికానికి ఓకే అన్నా... ఇతర గొంతెమ్మ కోర్కెల విషయంలోనే ఇబ్బంది తప్పదని సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయ్.