దాదాపు 13 ఏళ్ల తర్వాత తెలుగు తెరపై రీ ఎంట్రీ ఇచ్చింది లేడీ అమితాబ్ విజయశాంతి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో భారతిగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. ఓ వైపు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతూ దూసుకెళ్తున్న ఈ సినిమాలో విజయశాంతి నటనకు భారీ స్పందన వస్తోంది. జనవరి 11న సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమాలో విజయశాంతి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
అయితే ఈ సినిమాలో విజయశాంతిని తీసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసి ఒప్పించారట డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ మేరకు విజయశాంతికి భారీ రెమ్మ్యూనరేషన్ ఆఫర్ చేశారట. ఇందులో నటించేందుకు గాను ఆమె 2.5 కోట్లు డిమాండ్ చేయగా చివరకు 1.25 ఇచ్చి డీల్ సెట్ చేశారట.
విజయశాంతి అందుకున్న ఈ రెమ్మ్యూనరేషన్ 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో హీరోయిన్‌గా నటించిన రష్మిక మందన్న రెమ్మ్యూనరేషన్ కి డబుల్ అని తెలుస్తోంది. పైగా ఇటీవలి కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటిస్తూ మెప్పిస్తున్న సీనియర్ హీరోయిన్స్ టబు - నదియా - కుష్బూల కంటే విజయశాంతి రెమ్మ్యూనరేషనే ఎక్కువ అని ఇన్‌సైడ్ టాక్.
ఈ నేపథ్యంలో ఓ క్రేజీ అండ్ యంగ్ హీరోయిన్ కంటే విజయశాంతి ఎక్కువ రెమ్మ్యూనరేషన్ తీసుకోవడం జనాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ స్థాయిలో పైకం చెల్లించి కూడా 'సరిలేరు నీకెవ్వరు' అనిపించుకున్నారు అనిల్ రావిపూడి.