జక్కన్న తండ్రికి 2 వేల నోటు ఇచ్చే అలవాటు

Update: 2018-11-03 15:30 GMT
‘బాహుబలి’ - ‘బజరంగీ భాయిజాన్‌’ చిత్రాలకు కథ అందించడంతో విజయేంద్ర ప్రసాద్‌ ఒక్కసారిగా స్టార్‌ రైటర్‌ అయ్యాడు. ప్రస్తుతం జక్కన్న తెరకెక్కించబోతున్న ఆర్‌ మల్టీస్టారర్‌ కు స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్న విజయేంద్ర ప్రసాద్‌ మరో వైపు తాను కథ అందించిన ‘మణికర్ణిక’ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ను కూడా దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడట. ఇంకా ఇతర ప్రాజెక్ట్‌ లకు కూడా తన సాయంను అందిస్తూనే ఉన్నాడు. భారీ ఎత్తున పారితోషికం అందుకునే విజయేంద్ర ప్రసాద్‌ కు రెండు వేల నోటు ఇచ్చే వింత అలవాటు ఉందట.

విజయేంద్ర ప్రసాద్‌ రచయితగా ఒక స్థాయి  గుర్తింపు ఉన్న సమయంలో తనకు మంచి ఆలోచన చెప్పినా లేదంటే ఐడియా ఇచ్చిన వారికి 500 నోటు తీసి ఇచ్చేవారట. ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్‌ స్థాయి పెరిగింది. ఒక్కో కథకు కోట్లల్లో పారితోషికంను అందుకుంటున్నారు. అందుకే డైలాగ్‌ కు సంబంధించిన చిన్న ఐడియా ఇచ్చినా - స్టోరీకి సంబంధించి చిన్న క్లూ ఇచ్చినా - లీడ్‌ ఇచ్చినా కూడా వెంటనే తన వద్ద ఉన్న రెండువేల రూపాయల కట్ట నుండి ఒక నోటును తీసి ఇస్తూనే ఉంటాడట.

ఇలా ఆయన శిష్యులు ఎంతో మంది మంచి ఐడియాలు ఇస్తూ రెండు వేల రూపాయల నోట్లను ఆయన నుండి తీసుకుంటూ ఉన్నారట. విజయేంద్ర ప్రసాద్‌ శిష్యులు ఎక్కువగా ఈ విషయం గురించి చర్చించుకుంటూ ఉంటారట. మంచి ఐడియాలు ఇచ్చిన వారికి వెంటనే బహుమానం ఇవ్వడం అనేది చాలా మంచి పద్దతి అంటూ విజయేంద్ర ప్రసాద్‌ గురించి ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తుంది.
Tags:    

Similar News