టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి బాహుబలి సినిమాతో ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించి దర్శకధీరుడు అనిపించుకున్నాడు. బాహుబలి సిరీస్ విడుదలై నేమ్ ఫేమ్ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచింది. ఇప్పుడు ఆ ఫేమ్ తోనే రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా పై ప్రేక్షకులలో ఎక్కడలేని అంచనాలు ఆసక్తి ఏర్పడ్డాయి. గతేడాది కాలంగా ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కానీ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది అనుకున్న ప్రతిసారి ఏదొక ఆటంకం ఏర్పడి సినిమా వాయిదా పడుతూనే ఉంది. ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ కు సంబంధించి రెండుసార్లు డేట్ అనౌన్స్ చేశారు కానీ పరిస్థితులు అనుకూలించక వాయిదా పడింది. ఈసారి మాత్రం పక్కా అంటూ అక్టోబర్ 13ను రిలీజ్ డేట్ గా ప్రకటించారు. కానీ అదికూడా ఇప్పుడు కుదరదని కరోనా వలన ఆల్రెడీ షూటింగ్ ఆగిపోయింది.
అయితే నెలలు గడుస్తున్నా కొద్దీ రిలీజ్ ఎప్పుడు అని ఫ్యాన్స్ లో ఆసక్తి ఇంకా పెరుగుతూనే ఉంది. అసలే ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా మల్టీస్టారర్. మెగాపవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నటువంటి ఈ మూవీలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలను పోషిస్తున్నారు. షూటింగ్ కూడా చివరిదశలో ఉండటంతో సినిమా గురించి ఎలాంటి వార్త తెలిసినా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా ఈ సినిమాలో ఓ భావోద్వేగమైన సన్నివేశం గురించి వార్త బయటికి వచ్చింది. అయితే ఈ సినిమాలో రాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ జైలులో కలిసే సీన్ అందరిని ఎమోషనల్ గా ఏడిపిస్తుందని.. అలాంటి సీన్స్ ఈ సినిమాలో చాలానే ఉన్నాయని మేకర్స్ ఇదివరకే తెలిపారు.
కానీ తాజాగా ఈ సినిమా రైటర్ కేవీ విజయేంద్రప్రసాద్ సినిమాలోని మరో సన్నివేశం గురించి చెప్పి అంచనాలు రెట్టింపు చేసేసాడు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇంతవరకు చూపించని ఎమోషనల్ యాంగిల్ ఇందులో చూస్తారని.. ఓ ఫైట్ సన్నివేశం చూసి నేనే కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పుకొచ్చాడు విజయేంద్రప్రసాద్. ఆ సినిమా రచయిత చెప్పేసరికి నందమూరి అభిమానులలో కుతూహలం పెరిగిందనే చెప్పాలి. అందుకే కరెక్ట్ రిలీజ్ డేట్ చెప్పండి సార్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ రాంచరణ్ జోడిగా అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ జోడిగా ఓలివియా మోరిస్ కనిపించనుంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో డీవీవి దానయ్య నిర్మిస్తున్నాడు. చూడాలి మరి సినిమా రిలీజ్ అయ్యేది ఎప్పుడో..!