టాలీవుడ్ ఫిలిం మేకర్ క్రిష్ బాలీవుడ్లో తీస్తున్న మెగా సినిమా ‘మణికర్ణిక’. వీర నారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో కంగనా రనౌత్ ఝాన్సీ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా లాంచ్ చేశారు. ఐతే ఈ చిత్రం ఈ ఏడాది ప్రథమార్ధంలోనే రావాల్సింది. కానీ అనివార్య కారణాలతో వాయిదా పడింది. వచ్చే ఏడాది జనవరి 25న ‘మణికర్ణిక’ను రిలీజ్ చేస్తారని అంటున్నారు. ఐతే సినిమా మరీ అంత ఆలస్యం కావడానికి కారణం రీషూట్లే అని వార్తలొచ్చాయి. ఈ చిత్ర రషెస్ చూసిన నిర్మాతలు కొన్ని కీలక సన్నివేశాలపై అభ్యంతరాలు చెప్పారని.. దీంతో మళ్లీ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ సన్నివేశాల్ని మళ్లీ చిత్రీకరిస్తున్నారని.. అందుకే సినిమా లేటవుతోందని మీడియాలో కథనాలు వచ్చాయి.
దీనిపై ఈ చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్ స్పందించాడు. రీషూట్ రూమర్లను ఆయన ఖండించారు. తాను రషెస్ చూశానని.. ఔట్ పుట్ అద్భుతంగా వచ్చిందని.. సినిమాలో మార్పులు చేర్పులు ఏమీ అవసరం లేదని.. అన్నీ పర్ఫెక్టుగా ఉన్నాయని ఆయన అన్నారు. విజువల్ ఎఫెక్ట్స్ ఇతర పనుల వల్లే ఆలస్యమవుతోందని.. అలాగే కొంచెం ప్యాచ్ వర్క్ కూడా ఉందని.. పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయ్యేసరికి లేటవుతుందని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ‘మణికర్ణిక’ నిజమైన బ్లాక్ బస్టర్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా ‘మణికర్ణిక’ రిలీజ్ డేట్ విషయంలో తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 25కి హృతిక్ రోషన్ సినిమా ‘సూపర్ 30’ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. హృతిక్ తో కంగన వైరం దృష్ట్యా ఆ తేదీకి సినిమాను రిలీజ్ చేయడం మంచిది కాదని.. కావాల్సినన్ని థియేటర్లు దొరకడం కూడా కష్టమని నిర్మాతలు పునరాలోచన చేస్తున్నట్లు సమాచారం.