బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కెరీర్ లో ఎప్పటికీ గొప్పగా చెప్పుకోదగ్గ సినిమా ‘భజరంగి భాయిజాన్’. అప్పటిదాకా సల్మాన్ సినిమాలు వందల కోట్ల కలెక్షన్లు తెస్తున్నా సరే.. అవేవీ కూడా సల్మాన్ కు ప్రత్యేక గుర్తింపు ఏమీ తెచ్చిపెట్టలేదు. విమర్శకులు అతడి సినిమాల్ని దునుమాడేవారు. అర్థం పర్థం లేని సినిమాలు చేసి తన విలువను బాగా తగ్గించుకున్నాడు సల్మాన్. ఇలాంటి టైంలో ‘భజరంగి భాయిజాన్’ కండల వీరుడికి ఎంతో గౌరవం తెచ్చిపెట్టింది. సల్మాన్ కూడా మంచి సినిమాలు చేయగలడని.. మెప్పించగలడని రుజువు చేసింది. ఈ చిత్రానికి రూ.600 కోట్ల దాకా వసూళ్లు కూడా వచ్చాయి. ఐతే అంత పెద్ద హిట్టయిన సినిమాకు కథ అందించినందుకు మన విజయేంద్ర ప్రసాద్ కు ముందు ఇస్తానన్న పారితోషకం ఎంతో తెలుసా..? కేవలం రూ.40 లక్షలట.
ఐతే తాను మాత్రం రెండున్నర కోట్లిస్తే తప్ప ఆ కథను ఇచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెప్పానంటున్నారు విజయేంద్ర ప్రసాద్. చివరికి బేరం రూ.2 కోట్ల దగ్గర తెగిందని ఆయన వెల్లడించారు. సల్మాన్ ఖాన్ తండ్రి.. ప్రముఖ రచయిత అయిన సలీం ఖాన్ కు ఈ కథ తెగ నచ్చేసి అసలు సల్మాన్ పారితోషకంలో సగం విజయేంద్ర ప్రసాద్ కే ఇవ్వాలని చెప్పారట ఓ సందర్భంలో. తనకెంతో ఇష్టమైన ‘పసివాడి ప్రాణం’ సినిమా చూస్తుండగా.. ‘భజరంగి భాయిజాన్’ కథ పుట్టిందని.. ఆ తర్వాత ఇండియాలో తమ బిడ్డ ఆపరేషన్ కోసం వచ్చి.. ఇక్కడి వాళ్ల ఆదరణకు ముగ్ధులైపోయి కన్నీళ్లు పెట్టుకుంటున్న ఓ పాకిస్థాన్ జంటను టీవీలో చూసి.. ‘భజరంగి..’ పూర్తి స్క్రిప్టును తీర్చిదిద్దినట్లు వెల్లడించారు విజయేంద్ర ప్రసాద్.