'విక్రమాదిత్య' టైటిల్ పోస్టర్: ఇది క్రియేటివ్ డైరెక్టర్ డ్రీమ్ ప్రాజెక్ట్..!
క్రియేటివ్ డైరెక్టర్ తేజ గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న తేజ.. ఇప్పుడు మరో మూవీ కోసం యాక్షన్ లోకి దిగారు. నేడు తన పుట్టినరోజు సందర్భాన్ని పురష్కరించుకొని దర్శకుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను ప్రకటించారు. ''విక్రమాదిత్య'' అనే టైటిల్ తో ఓ ఎపిక్ లవ్ స్టోరీని తెరకెక్కించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రీ లుక్ పోస్టర్ ను మేకర్స్ ఆవిష్కరించారు.
''విక్రమాదిత్య'' టైటిల్ పోస్టర్ లో రైలు నుంచి వచ్చే పొగ మధ్యలో ఓ జంట ఉద్వేగభరితమైన రొమాన్స్ లో మునిగి తేలుతున్నట్లు కనిపిస్తోంది. ఈ కథ 1836 సంవత్సరంలో సెట్ చేయబడిందని ఈ ఆసక్తికరమైన బ్లాక్ అండ్ వైట్ పోస్టర్ లో పేర్కొన్నారు. సర్ ఆర్థర్ కాటన్ ఆ సమయంలో దౌలేశ్వరం బ్యారేజీని నిర్మించాడనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. వంతెనతో ఈ ప్రేమ కథకు ఏదో సంబంధం ఉండొచ్చు.
మొత్తం మీద 1836 నేపథ్యంలో ఓ ఇన్నోసెంట్ క్లాసిక్ లవ్ టేల్ ను తెరపై చూడబోతున్నాం అనే అభిప్రాయాన్ని 'విక్రమాదిత్య' పోస్టర్ కలిగిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఈరోజు 22:2:22 మధ్యాహ్నం 2:22 గంటలకు శుభ ముహూర్తంలో ప్రారంభమమైంది. ఆసక్తికరంగా తేజ డైరెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీ 'జయం' షూటింగ్ కూడా సరిగ్గా 20 సంవత్సరాల క్రితం అదే సమయంలో ప్రారంభమైంది.
'విక్రమాదిత్య' చిత్రాన్ని భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లను తెరకెక్కించడంలో పేరున్న బుజ్జి.. ఈ పీరియాడికల్ లవ్ డ్రామాని భారీ స్థాయిలో తెరకెక్కించనున్నారు. ప్రముఖ నటీనటులు - కొంతమంది ఏస్ టెక్నీషియన్లు ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ లో భాగం కానున్నారని మేకర్స్ తెలిపారు. త్వరలోనే ఈ వివరాలు వెల్లడి కానున్నాయి.
దర్శకుడు తేజ టాలీవుడ్ కు ఏంటో మంది నటీనటులు - సాంకేతిక నిపుణులను పరిచయం చేసారు. ఇప్పుడు 'అహింస' అనే సినిమాతో దగ్గుబాటి వారసుడు అభిరామ్ హీరోగా లాంచ్ అవుతున్నారు. మంగళవారం టైటిల్ ప్రీలుక్ ను వదిలారు. అలానే 'చిత్రం 1.1' సినిమాతో మరికొందరు కొత్తవారిని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఈ క్రమంలో రాబోయే ''విక్రమాదిత్య'' సినిమాలో ఎవరిని ఎంపిక చేశారనేది ఆసక్తికరంగా మారింది.