బాలీవుడ్ సంధికాలంలో ఉంది. సరైన బ్లాక్ బస్టర్ లు లేక అల్లాడుతోంది. భూల్ భులయా 2 లాంటి చిన్న సినిమా .. కాశ్మీర్ ఫైల్స్ వంటి డాక్యు సినిమా విజయాలు సాధించకపోయి ఉంటే పరిస్థితి ఇంకెలా ఉండేదోననే చర్చ ఇటీవల సాగింది. అగ్ర హీరోల సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్లుగా మారుతుండడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలోనే ఓ సౌత్ రీమేక్ బాలీవుడ్ ని ఆదుకుంటుందని చాలా హోప్స్ పెట్టుకున్న సంగతి తెలిసిందే.
హృతిక్ రోషన్ - సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ విక్రమ వేద పై చాలా ఆశలు అంచనాలు వేడెక్కించాయి. దానికి తగ్గట్టుగా తొలిరోజు సమీక్షలు చాలా అనుకూలంగా ఉన్నాయి. చాలా మంది దీనిని పరిపూర్ణ రీమేక్ అని అభివర్ణించారు. అంచనాల కంటే 1వ రోజు తక్కువ పనితీరు కనబరిచడమే నిరాశపరిచింది. అయితే ఈ సినిమా 2వ రోజు బెటర్ మెంట్ చూపిస్తుందని ఆశిస్తే అది కనిపించలేదన్న ఆందోళన ట్రేడ్ లో కనిపిస్తోంది.
నిజానికి ప్రీ-రిలీజ్ బజ్ బాగానే ఉంది. సైఫ్ అలీ ఖాన్... హృతిక్ రోషన్ విడివిడిగా సినిమాను ప్రమోట్ చేయడంతో సందడిని పెంచగలిగారు. వీరి ప్రేమ-ద్వేషాలకు సంబంధించిన కెమిస్ట్రీని తెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసారు. కానీ బాక్సాఫీస్ వద్ద అది ప్రతిఫలించకపోవడం ఆశ్చర్యపరుస్తోంది.
బాలీవుడ్ అంతటా బహిష్కరణ ధోరణి కారణంగా స్టార్ హీరోలు బెంబేలెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల అక్షయ్ సామ్రాట్ పృథ్వీరాజ్ - దేవగన్ రన్‌వే 34 .. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా వైఫల్యాలకు ఇది కూడా ఒక కారణమని భావిస్తున్నారు. ఆ తర్వాత మొదటి రోజు టిక్కెట్లు కొనడానికి ముందు చాలా మంది ప్రజలు సందేహిస్తున్నారు.
విక్రమ్ వేద 1వ రోజు దాదాపు 10.58 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కానీ హృతిక్ రేంజు స్టార్ కి ఇది చాలా తక్కువ. కొన్ని చోట్ల షోల సంఖ్య పెరిగాయని చెబుతున్నా కానీ అడ్వాన్స్ బుకింగ్ రిపోర్ట్స్ ఆశాజనకంగా కనిపించడం లేదు. ఈ సినిమాపై ఎగ్జిబిటర్లు భారీ ఆశలు పెట్టుకున్నారని తెలుస్తుంది.
ప్రధాన స్రవంతి హిందీ మాస్ చిత్రం `విక్రమ్ వేద` బాక్స్ ఆఫీస్ విజేతగా నిలుస్తుందా లేదా? అన్నదానికి ఇప్పుడే క్లారిటీ రాదు. ఈ చిత్రం రెండవ రోజు (శనివారం) దాదాపు 12 కోట్ల రూపాయలను వసూలు చేస్తుందని అంచనా. కానీ ఇది సాధారణ ఆరంభం మాత్రమేనని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే బ్లాక్ బస్టర్స్ లేకపోవడంతో చాలా ఒత్తిడిలో ఉన్న బాలీవుడ్ కు మరింత కష్టం పెరిగినట్టేనని భావిస్తున్నారు. ఆక్యుపెన్సీ మెరుగవ్వకపోవడం భయపెడుతోంది. తొలి వీకెండ్ నాటికి ఈ సినిమా ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి.