మహర్షిలో మట్టి వాసన!

Update: 2018-08-12 07:17 GMT
మహేష్ బాబు 25వ సినిమాగా తెరకెక్కుతున్న మహర్షి విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ దాని తాలూకు అప్ డేట్స్ ఇప్పటి నుంచే ఫ్యాన్స్ ను యాంగ్జైటీలో ముంచెత్తుతున్నాయి. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ రావడం పట్ల యూనిట్ కూడా యమా ఉత్సాహంగా ఉంది.  కాకపోతే స్టోరీకి సంబంధించిన కొన్ని అంశాలు  లీకుల రూపంలో బయటికి వస్తుండటంతో మెల్లగా కథ ఏ జానర్ లో ఉండబోతోంది అనే దాని గురించి అవగాహన వస్తోంది. నిన్న మహర్షి డీ కోడింగ్ పేరిట తుపాకీ అందించిన ప్రత్యేక కథనంలో ఆరు కీలకమైన అంశాలు లోగోలో ఎలా ఇమిడ్చారు అనే విశ్లేషణ చూసారుగా. ఇప్పుడు విశ్వసనీయ సమాచారం మేరకు అందించిన మరో పాయింట్ ప్రకారం ఇందులో కీలకమైన సెకండ్ హాఫ్ ఒక పల్లెటూరి నేపథ్యంలో సాగుతుందట. దానికి అల్లరి నరేష్ పాత్రకు బలమైన కనెక్షన్ ఉండటం వల్లే మహేష్ ఆ ఊరికి రావాల్సి వస్తుందట. అసలు ఆ సమస్య ఏమిటి మహేష్ అమెరికా నుంచి ఇండియాకు రావడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి అనేదే మహర్షి లో కీలకమట.

మహేష్ కు విలేజ్ బ్యాక్ డ్రాప్ సెంటిమెంట్ బాగా కలిసి వచ్చింది. గతంలో శ్రీమంతుడులో ఇదే హై లైట్ కాగా భరత్ అనే నేనులో సైతం సీమ గ్రామం పేరిట ఒక స్పెషల్ ఎపిసోడ్ ని పొందుపరిచారు. రెండు ఫలితాలు బ్లాక్ బస్టర్ కు తగ్గలేదు. గతంలో మురారి సినిమా మొత్తం పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లోనే రూపొందింది. దాని ఘనవిజయం గురించి ఇప్పటికీ అభిమానులు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఒక్కడులో సైతం హీరోయిన్ భూమిక నేపధ్యం పల్లెటూరే ఉంటుంది. ఇలా ఈ రకంగా మరో ప్లస్ తోడయ్యింది. ఇటీవలే డెహ్రాడూన్ లో కాలేజీ సన్నివేశాలు షూట్ చేసుకొచ్చిన యూనిట్ త్వరలో అమెరికాలో కీలక షెడ్యూల్ చేయబోతోంది. ఏప్రిల్ 5 విడుదల ఇప్పటికే ఖరారు చేసినా నిన్నటి నుంచి మార్పు గురించి కొన్ని వార్తలు ప్రచారమయిన నేపధ్యంలో అలాంటిది ఏమి లేదని ఉగాది పండగ కానుకగా మహర్షి అలరించడం ఖాయమని యూనిట్ టాక్.
Tags:    

Similar News