హీరో కంటే ముందే విలన్.. హీరోయిన్ ఫిక్స్!

Update: 2018-12-14 17:30 GMT
తమిళ భాషలో సూపర్ హిట్ అయిన 'జిగార్తాండ'(2016) సినిమాను తెలుగులోకి రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే సంగతి తెలిసిందే.  సిద్దార్థ్ హీరోగా బాబీ సింహా విలన్ గా నటించిన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తాడు.  'దువ్వాడ జగన్నాధం' తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇదే.

ఈ సినిమాలో బాబీ సింహా పోషించిన విలన్ పాత్రలో నటించేందుకు మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న వార్తలు ఇప్పటికే అందరికీ షాక్ ఇచ్చాయి. హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతున్న సమయంలో ఇలా నెగెటివ్ రోల్ నటించడానికి ఒప్పుకోవడం ఆశ్చర్యమే.  ఇదిలా ఉంటే ఈ సినిమాలో సిద్ధార్థ్ పాత్రకు ఇద్దరు యంగ్ హీరోలను సంప్రదించాడట హరీష్ శంకర్.  అందులో ఒకరు నాగ శౌర్య కాగా మరొకరు రాజ్ తరుణ్. ఇద్దరిలో ఒకరు ఈ సినిమాలో హీరోగా నటించడం దాదాపు ఖాయమేనట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నను ఫైనలైజ్ చేశారట.  

డార్క్ కామెడీ అయినా తెలుగు హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న స్టొరీ కాబట్టి నాగశౌర్య గానీ రాజ్ తరుణ్ గానీ ఈ సినిమాను వదులుకోకపోవచ్చు. కాకపోతే హీరో కంటే విలన్ రోల్ స్ట్రాంగ్ కావడంతో విలన్ పాత్ర పోషించే నటుడికే ఎక్కువ పేరు వచ్చే ఛాన్స్ ఉంది.  రీమేక్ సినిమాలకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ లా చూపించే 'గబ్బర్ సింగ్' లాంటి సినిమాను డైరెక్ట్ చేసిన హరీష్ శంకర్ ఈ రీమేక్ కు తెలుగు లో ఎలాంటి మార్పులు చేస్తాడో వేచి చూడాలి.  14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది.
Tags:    

Similar News