సుక్కుకి వినాయక్ ముందే చెప్పాడు

Update: 2016-01-21 13:30 GMT
నాన్నకు ప్రేమతో ఇప్పుడు సంక్రాంతి సినిమాల్లో బిగ్గెస్ట్ మూవీగా నిలిచింది. అయితే.. పొంగల్ రిలీజ్ లలో అన్నిటికంటే ముందు రిలీజ్ అయిన సినిమా కూడా ఇదే. మొదటి రోజు మొదటి షో పడగానే వచ్చిన టాక్ ఏమంత బాగాలేదు. రివ్యూలు కూడా యావరేజ్ అనే అని వచ్చాయి. మరోవైపు మౌత్ టాక్ కూడా బాగా హైక్లాస్ మూవీ, అందరికీ ఎక్కదు అన్నట్లుగానే స్ప్రెడ్ అయింది.

అయితే.. ఒక వ్యక్తి మాత్రం ఈ విజయాన్ని ముందే ఊహించాడు. ఆయనే సూపర్ మాస్ డైరెక్టర్  వివి వినాయక్. మౌత్ టాక్ ఎలా ఉన్నా.. ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని చెప్పాడు వినాయక్. సంక్రాంతి పోటీలో యావరేజ్ టాక్ వస్తే నిలబడ్డం కష్టమని అందరూ భావించిన తరుణంలోనే ఈ విజయాన్ని వినాయక్ ఊహించాడు. అందుకే వెంటనే సుకుమార్ కాల్ చేసి, ఏ మాత్రం అధైర్య పడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చాడు. తొలి రోజు తొలి ఆటనే చూసిన వినాయక్.. ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని కోల్పోవద్దని సుకుమార్ కి చెప్పాడట.

మాస్ డైరెక్టర్ చెప్పినట్లుగా ఈ క్లాస్ మూవీ అందరి అంచనాలను దాటిపోయి బ్లాక్ బస్టర్ రూట్ లో దూసుకుపోతోంది. మొదటి ఏడు రోజుల్లోనే 42 కోట్ల రూపాయల భారీ షేర్ ను సాధించి, 50 కోట్ల రూట్లో ఉంది. ఎన్టీఆర్ కి తొలిసారిగా ఈ మార్క్ ను అందించే సినిమాగా నాన్నకు ప్రేమతో నిలిచిపోనుంది. అయితే.. ఈ మూవీ డైరెక్టర్ సుకుమార్.. గతంలో వినాయక్ దగ్గర అసిస్టెంట్ గా పని చేశాడు. 2003లో రిలీజ్ అయిన దిల్ మూవీకి.. సుక్కు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు.

Tags:    

Similar News