హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి - సెన్సేషనల్ బ్యూటీ సాయిపల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ''విరాటపర్వం''. వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి 'రివల్యూషన్ ఈజ్ యాక్ట్ ఆఫ్ లవ్' అనేది ట్యాగ్ లైన్. సురేష్ బాబు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ మరియు శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 30న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు రిలీజ్ చేసిన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ - ఫస్ట్ గ్లింప్స్ మరియు 'కోలు కోలు' సాంగ్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'విరాటపర్వం' టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.
'ఆధిపత్య జాడలనే చేరిపేయగ ఎన్నినాళ్ళు.. తారతమ్య గోడలనే పెకిలించక ఎన్నినాళ్లు.. దున్నేటోడి వెన్ను విరిచి భూస్వాములు ధనికులైరి' అంటూ రానా చెప్పడంతో ఈ టీజర్ ప్రారంభమైంది. విప్లవాత్మక భావాలు కలిగిన అరణ్య రాసిన కవితలను ఆరాధించే వెన్నెల.. అతని ప్రేమ కోసం ఇల్లు విడిచిపోయి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందనేది ఇందులో చూపించారు. అలానే సాయిపల్లవిపై పోలీసులు అసభ్యంగా ప్రవర్తించడం.. చివరకు ఆమె 'దొంగ ల.. కొడకా' అంటూ దుమ్మెత్తి పోయడం చూపించారు.1990ల నాటి వాస్తవ సంఘటనల ఆధారంగా నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందింది. అరణ్య కామ్రేడ్ రవన్న గా ఎలా మారాడు.. చరిత్రలో దాగిన కథలకు తెరలేపిన వెన్నెల ప్రేమ కథ నక్సలైట్లు పోలీసుల మధ్య ఘర్షణలో ఎలా ముగిసింది అనేది తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.
ఈ టీజర్ ఆద్యంతం భావోద్వేగ అంశాలతో ఉద్వేగభరితంగా సాగుతూ ఆకట్టుకుంటుంది. రానా - సాయి పల్లవి ఇద్దరూ తమ పాత్రల్లో జీవించినట్లు అర్థం అవుతోంది. ఇక ఈ చిత్రంలో భారతక్కగా నటి ప్రియమణి కనిపించింది. నివేథా పేతురాజ్ - నందితా దాస్ - నవీన్ చంద్ర - ఈశ్వరీరావు - జరీనా వహాబ్ - సాయిచంద్ - బెనర్జీ - రాహుల్ రామకృష్ణ - నాగినీడు తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ టీజర్ కి సురేష్ బొబ్బిలి అందించిన నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. ఒక యూనిక్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ సినిమా టీజర్ తో అంచనాలు రెట్టింపు చేసింది. ఈ చిత్రానికి డానీ సాంచెజ్ లోపెజ్ - దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇకపోతే 'విరాటపర్వం' టీజర్ రిలీజ్ చేసిన మెగాస్టార్ ఇదొక రా అండ్ రియలిస్టిక్ లవ్ స్టోరీలా ఉందని.. చిత్ర బృందానికి తన విషెస్ అందించారు.
Full View