విరాటపర్వం సెన్సార్ ఫినిష్.. రన్ టైమ్ ఫిక్స్

Update: 2022-06-14 14:30 GMT
సాయి పల్లవి రానా దగ్గుబాటి కలిసి నటించిన మొట్టమొదటి చిత్రం విరాటపర్వం సినిమా కోసం ఓ వర్గం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో విప్లవాత్మక ప్రేమకథగా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవల అంచనాల స్థాయిని అమాంతంగా పెంచేసింది. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఈనెల 17వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.

ఇక సినిమాకు సంబంధించిన ప్రమోషన్ విషయంలో కూడా చిత్ర యూనిట్ సభ్యుల దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడా తగ్గకుండా ఈ సినిమాకు ఒక రెండు వారాల్లోనే మంచి హైప్ ఐతే క్రియేట్ చేశారు. అసలు ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా గురించి అందరూ మరచిపోతున్న సమయంలో చిత్ర యూనిట్ సభ్యులు హఠాత్తుగా ప్రమోషన్స్ చేసి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశారు.

విరాట పర్వం సినిమా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ లభించినట్లు సమాచారం. సినిమా రన్‌టైమ్ కూడా రివీల్ చేయబడింది.

ఇక విరాటపర్వం 2 గంటల 31 నిమిషాల నిడివితో ఉంది. సినిమాను వీక్షించిన సెన్సార్ సభ్యులు కూడా పాజిటివ్ గా స్పందించినట్లు తెలుస్తోంది. ఇక ఈ వినిమా మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ స్థాయిలోనే విడుదలవుతుంది.

సాయి పల్లవి సినిమాలో మెయిన్ హీరోయిన్ కాగా రానా దగ్గుబాటి కూడా ప్రత్యేకంగా ప్రమోషన్ చేయడం విశేషం. వీరు ఇచ్చిన ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఎక్కడ తగ్గకుండా సినిమాకు భారీ లెవెల్లో ప్రమోషన్స్ చేస్తూ జనాల్లోకి తీసుకువెళ్తున్నారు. చూస్తుంటే సినిమా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ అందుకునే అవకాశం అయితే ఉంది.

లవ్ స్టోరీ ఏ మాత్రం కనెక్ట్ అయిన కూడా ఆడియన్స్ మౌత్ టాక్ ద్వారా కలెక్షన్స్ పెరగడం కాయం. ఇక సినిమా టికెట్లు రేట్లు కూడా ఎక్కువ స్థాయిలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News