విరూపాక్ష పాన్ ఇండియా కాదట.. దసరా దెబ్బె

Update: 2023-04-19 18:00 GMT
బాహుబలి సిరీస్ తర్వాత సౌత్ నుంచి పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది. తెలుగు నుంచి అయితే ఎక్కువగా మల్టీ లాంగ్వేజ్ ప్రాజెక్ట్స్ తెరకెక్కుతున్నాయి. అయితే టైర్ 2 హీరోలు కూడా పాన్ ఇండియా అంటే ఈ మధ్య మొదలుపెట్టారు. ఈ హీరోలకి ఆశించిన స్థాయిలో నార్త్ మార్కెట్ లేకపోవడం, సినిమాని స్ట్రాంగ్ గా ప్రమోట్ చేయలేకపోవడంతో పెద్దగా రీచ్ ఉండటం లేదు.

రీసెంట్ గా దసరా సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన మిగిలిన భాషలలో ప్రేక్షకులకి చేరువ కాలేదు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు టైర్ 2 హీరోలు అయిన తేజ్, అఖిల్ రిస్క్ చేయకుండా సేఫ్ గేమ్ ఆడటానికి రెడీ అయ్యారు. ఏప్రిల్ 21 సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష మూవీ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

నిజానికి ఈ సినిమాని ఐదు భాషలలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే ప్రస్తుతం రిస్క్ చేయడం ఇష్టం లేక కేవలం తెలుగుకి మాత్రమే పరిమితం అయ్యారు. తెలుగులో ఈ మూవీకి సక్సెస్ వస్తే దానిని బట్టి ఇతర భాషలలో ప్లాన్ చేసే అవకాశం ఉంది. ఇక అఖిల్ ఏజెంట్ మూవీని పాన్ ఇండియా లెవల్ లోనే రిలీజ్ చేయాలని భావించారు.

అయితే ఇప్పుడు టైమ్ తక్కువగా ఉండటంతో తెలుగు, మలయాళీ భాషలలో మాత్రమే ఏజెంట్ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. తరువాత టైమ్ చూసుకొని హిందీతో పాటు ఇతర భాషలలో రిలీజ్ చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. దసరా సినిమాకి నార్త్ లో ఎఫెక్ట్ తలగడంతోనే ఇప్పుడు విరూపాక్ష, ఏజెంట్ సినిమాల విషయంలో నిర్మాతలు తమ నిర్ణయాలని మార్చుకున్నట్లుగా టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది.

 ఈ రెండు సినిమాలకి కూడా ప్రస్తుతం తెలుగులో అయితే మంచి బజ్ ఉంది. ఓపెనింగ్స్ అయితే గట్టిగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కంటెంట్ బట్టి తరువాత మూవీ టాక్ డిపెండ్ అయ్యి ఉంటుంది. సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం అప్పుడు ఇతర భాషలలో రిలీజ్ చేసిన ఆ పబ్లిక్ రివ్యూ కూడా సినిమాని మార్కెట్ లోకి పంపించడానికి ఉపయోగపడుతుంది.

Similar News