సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని వారాలుగా హైదరాబాద్ లో జరుగున్న ఈ సినిమా షూటింగ్ తాజా షెడ్యూల్ త్వరలో అమెరికాలో ప్రారంభం కావాల్సి ఉంది. అందుకోసం 'మహర్షి' టీమ్ మంగళవారం నాడు అంటే 11 వ తారీఖునే ఆమెరికా కు బయలుదేరాల్సిఉంది. కానీ విసాల సమస్యతో అమెరికా ప్రయాణం మరి కొద్ది రోజులు వాయిదా పడిందట.
ఫారిన్ షూటింగ్ ఉండే సమయంలో ఫిలిం మేకర్స్ సహజంగా అతి తక్కువమంది యూనిట్ సభ్యులతో విదేశాలకు వెళతారు. ఇక విదేశంలో లోకల్ గా ఉండేవారిని అవసరాన్ని బట్టి షూటింగ్ కోసం తీసుకుంటారు. కానీ వంశీ పైడిపల్లి మొత్తం డైరెక్షన్ డిపార్ట్ మెంట్ తో పాటుగా ప్రొడక్షన్ మేనేజర్స్.. ఇతర సభ్యులను కూడా అమెరికా షెడ్యూల్ కోసం తీసుకెళ్ళాలని ప్లాన్ చేయడం జరిగిందట. బల్క్ లో వీసాల కోసం అప్లై చేయడంతో వీసాల జారీ ముందుగా అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతోందట.వీసాలు ఇంకా రాకపోవడంతో అమెరికాకు వెళ్లి అక్కడ షూటింగ్ జరుపుకోవాల్సిన టీమ్ ప్రస్తుతం సమయం వృధా కాకుండా హైదరాబాద్ లోనే షూటింగ్ ను జరుపుతున్నారట.
వీసాలు లభించిన వెంటనే 'మహర్షి' టీమ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా అమెరికా కు బయలుదేరాలని ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉంటే 'మహర్షి' లో మహేష్ ఒక స్టూడెంట్ గా కనిపిస్తాడు మరో షేడ్ లో ఒక బిజినెస్ మ్యాన్ లా కనిపిస్తాడట. అంతే కాదు అమెరికా షెడ్యూల్ లో మహేష్ కు సెకండ్ గెటప్ ఉంటుందట.