ఉగాదికి తెలుగు సినిమా చేస్తా.. 'చక్ర' ప్రీ-రిలీజ్‌ వేడుకలో విశాల్!

Update: 2021-02-13 23:30 GMT
ప్ర‌ముఖ కోలీవుడ్ హీరో విశాల్ - ద‌ర్శ‌కుడు ఎంఎస్‌ ఆనందన్ కాంబోలో రాబోతున్న చిత్రం 'విశాల్ చ‌క్ర‌'. జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్, రెజీనా కసండ్రా హీరోయిన్లుగా నటిస్తున్నారు. విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై స్వయంగా విశాల్ ఈ సినిమాను‌ నిర్మిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 19న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.  

ఈ సంద‌ర్భంగా హైదరాబాద్ ‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో హీరో విశాల్ మాట్లాడారు. తమ సినిమా డిజిటల్ క్రైమ్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పారు. దర్శకుడు ఆనంద‌న్ ఎంతో కష్టపడి ఈ సినిమా తీశారని, ఆయ‌న‌కు బ్రైట్ ఫ్యూచ‌ర్ ఉందని అన్నారు విశాల్. మ్యూజిక్ డైరెక్టర్ తోపాటు, డిస్ట్రిబ్యూటర్ ను కూడా తమ్ముడు అని సంబోధించడం విశేషం. 'నా త‌మ్ముడు యువ‌న్ శంక‌ర్ రాజా ఎక్ట్రార్డిన‌రీ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. నా త‌మ్ముడు వ‌రంగ‌ల్‌ శ్రీ‌ను స‌హా ఈ సినిమా డిస్ట్రిబ్యూట‌ర్స్ అందరూ  ఈ సినిమాతో త‌ప్ప‌కుండా ఒక జాక్ పాట్ కొడ‌తారు.' అని అన్నారు.

ఇక తన స్ట్రయిట్ తెలుగు చిత్రంపైనా స్పందించాడీ తమిళ్ హీరో. 'చాలా మంది అడుగుతున్నారు.. స్ట్ర‌‌యిట్ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారని? త‌ప్ప‌కుండా నెక్ట్స్ ఇయ‌ర్ ఉగాదికి  నా స్ట్ర‌యిట్ తెలుగు సినిమా విడుద‌ల‌వుతుంది' అన్నారు విశాల్.

ద‌ర్శ‌కుడు ఎంఎస్ ఆనంద‌న్ మాట్లాడుతూ.. ''ఎక్క‌డో ఉన్న న‌న్ను ఈ స్థాయికి విశాల్‌గారు తీసుకువ‌చ్చారు. ఈ సినిమా ఇంత గొప్ప‌గా వ‌చ్చిందంటే దానికి కార‌ణం విశాల్‌గారే'' అని అన్నారు. టెక్నీషియ‌న్స్ అంతా క్రియేటివ్‌గా వ‌ర్క్ చేశారన్న ఆనందన్.. యువ‌న్ శంక‌ర్ రాజా మంచి మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారని అన్నారు. కాగా.. ఈ సినిమా హీరో విశాల్ - మ్యూజిక్ డైరెక్ట‌ర్ యువ‌న్ కాంబినేష‌న్‌లో వస్తున్న 10వ చిత్రం కావ‌డం విశేషం.ఈ ప్రీ రిలీజ్ వేడుకలో.. 'మిస్ ఇండియా' ద‌ర్శ‌కుడు న‌రేంద్ర‌నాథ్, ప‌వ‌న్ తేజ్ కొణిదెల,  మేఘ‌న, నైజాం డిస్ట్రిబ్యూట‌ర్ వ‌రంగ‌ల్ శ్రీ‌ను, సీడెడ్ డిస్ట్రిబ్యూటర్‌ శోభ‌న్ త‌రుపున‌ న‌ర‌సింహ‌సాయి పాల్గొన్నారు.
Tags:    

Similar News