హీరోగా విలన్.. విలన్ గా హీరో..?

Update: 2021-02-01 16:30 GMT
కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న హీరో విశాల్.. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టనున్నాడని బీ టౌన్ లో వార్తలు వినిస్తున్నాయి. అది కూడా విలన్ గా అని అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే విశాల్ హీరోగా నటించిన సూపర్ హిట్ 'అభిమన్యుడు' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. కరోనా లాక్ డౌన్ టైంలో సామాజిక సేవా కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సోనూసూద్ ఇందులో హీరోగా నటించనున్నాడు.

తమిళ్ లో విశాల్ హీరోగా యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా.. అక్కినేని సమంత హీరోయిన్ గా 'ఇరుంబు తిరై' చిత్రం తెరకెక్కింది. ఇదే సినిమా తెలుగులో 'అభిమన్యుడు' పేరుతో డబ్ అయింది. అయితే ఇప్పుడు హిందీలో మాత్రం సోనూసూద్ హీరోగా నటిస్తుండగా.. విశాల్ విలన్ గా కనిపించనున్నాడట. అక్కడ అర్జున్ పోషించిన సైబర్ విలన్ పాత్రలో విశాల్ నటిస్తాడని అంటున్నారు. కాకపోతే విశాల్ తెలుగు తమిళ భాషల్లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి ఇప్పుడు బాలీవుడ్ లో ప్రతినాయకుడిగా నటిస్తాడా లేదా అనేది చూడాలి.
Tags:    

Similar News