సినీ ప్రేక్షకులపై విశాల్ కామెంట్.. తమిళ్, తెలుగు ఆడియన్స్ కు చాలా తేడా ఉందన్న హీరో!
కోలీవుడ్ హీరో విశాల్ లేటెస్ట్ మూవీ 'చక్ర'. దర్శకుడు ఎంఎస్ ఆనందన్ తెరకెక్కించిన ఈ మూవీని.. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై స్వయంగా విశాల్ నిర్మించారు. జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్, రెజీనా కసండ్రా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫిబ్రవరి 19న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.
విశాల్ కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో.. విశాల్ ఏ సినిమా చేసినా తమిళ్ తోపాటు తెలుగులోనూ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో చక్ర సినిమా కూడా తెలుగులో విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్లో బిజీగా ఉన్న విశాల్ తెలుగు ఆడియన్స్ పై ఇంట్రస్టింగ్ కామెంట్ చేశాడు.
తెలుగు ప్రమోషన్లో భాగంగా నిర్వహించిన ఓ ఈవెంట్ లో మాట్లాడిన విశాల్.. పైరసీ గురించి ఎవరూ ఊహించని కామెంట్ చేశాడు. పైరసీ విషయంలో తెలుగు, తమిళ్ ఆడియన్స్ ఏ విధంగా స్పందిస్తారు.. వారి మధ్య ఎంత తేడా ఉందో చెప్పాడు. తెలుగు ప్రేక్షకులు చాలా వరకు పైరసీ వైపు వెళ్లరని అన్న విశాల్.. అది తనకు బాగా నచ్చుతుందని అన్నాడు.
అసలు విశాల్ ఏమన్నాడంటే.. ''నేను తమిళ్ లో సినిమా గురించి ప్రెస్ మీట్ పెడితే.. తప్పకుండా పైరసీ గురించి మాట్లాడతాను. కానీ.. తెలుగులో ఒక్కసారి కూడా పైరసీ గురించి మాట్లాడలేదు. ఎందుకంటే ఇక్కడ ఆడియన్స్ థియేటర్స్ లోనే సినిమాను ఎక్కువగా చూస్తారు.'' అన్నాడు విశాల్.
అంతేకాదు.. తెలుగు ప్రేక్షకుల్లో రిపీట్ ఆడియన్స్ కూడా ఎక్కువగా ఉంటారని చెప్పాడు విశాల్. సినిమాను పైరసీలో కాకుండా.. థియేటర్స్ లో చూడాలని చాలా బాగా సపోర్ట్ చేస్తారని చెప్పాడు విశాల్.