తెలుగు కుర్రాడే అయినా కోలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగిన విశాల్.. ప్రస్తుతం వరుస రిలీజ్ లు, హిట్స్ తో ఊపు మీదన్నాడు. నడిగర్ సంఘానికి బిల్డింగ్ కట్టిన తర్వాత.. అక్కడ జరిగే తొలి పెళ్లి నాదే అంటూ.. ఇంతకుముందే ముహూర్తం కూడా అనౌన్స్ చేసిన విశాల్.. పెళ్లి కూతురి విషయంలో సైలెన్స్ మెయింటెన్ చేశాడు.
విశాల్ కు సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురుతో వరలక్ష్మితో ప్రేమ వ్యవహారం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సంగతిని ఇప్పటివరకూ ఒప్పుకోని పందెం కోడి.. ఇప్పుడు మాత్రం తనకు చిన్నప్పటి నుంచి స్నేహితురాలైన వరలక్ష్మి అంటే చాలా ఇష్టం, ప్రేమ అని ఒప్పుకున్నాడు. కానీ ఇది పెళ్లి చేసుకునేంతటి ప్రేమా, కాదా అని మాత్రం ఇప్పటివరకూ డిసైడ్ చేసుకోలేదట. అసలు పెళ్లి విషయంలోనే తాను ఇంకా ఓ క్లారిటీకి రాలేదని చెబుతున్నాడు. శరత్ కుమార్ తో విశాల్ కి విబేధాలున్నాయి. వీటికి కారణం వరలక్ష్మితో ప్రేమ వ్యవహారమేనా అంటే.. నవ్వేస్తున్నాడు విశాల్.
'శరత్ కుమార్ కూడా తన కూతురు కారణంగా మా మధ్య విబేధాలున్నాయని అనుకోరని భావిస్తా. మా ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలన్నీ నడిగర్ సంఘానికి సంబంధించినవే' అంటూ మళ్లీ మాట దాటేశాడు విశాల్. ప్రేమ సంగతి ఒప్పుకున్నా.. తను చెప్పిన 2017 జనవరి 15న పెళ్లి ముహూర్తానికి.. పెళ్లి కూతురు వరలక్ష్మే అని మాత్రం అనలేదు ఈ పందెం కోడి.