విశాల్ బండారం బయట పెడతానంటోంది

Update: 2020-07-07 10:10 GMT
తమిళ్ ఇంకా తెలుగు సినిమా ప్రేక్షకులను అలరిస్తూ ఆకట్టుకుంటున్న హీరో విశాల్ ఈమధ్య కాలంలో పలు వివాదాల బారిన పడుతున్నారు. నటుల సంఘంలో అవకతవకలు.. నిర్మాతల మండలిలో అవకతవకలు ఇలా అన్ని రకాలుగా విశాల్ ను కొందరు టార్గెట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో విశాల్ మరో చిక్కుల్లో పడ్డారు.

విశాల్ ఆఫీస్ లో గత ఆరు సంవత్సరాలుగా రమ్య అనే మహిళ వర్క్ చేస్తుందట. ఆమె కంపెనీ ని ఈ ఆరు సంవత్సరాల్లో దాదాపుగా రూ.45 లక్షలకు మోసం చేసిందని విశాల్ మేనేజర్ హరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై నమోదు అయిన కేసుపై రమ్య సీరియస్ అయ్యింది. విశాల్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

హీరోగా చెలామణి అవుతున్న విశాల్ నిజ స్వరూపం విలన్. ఆయన నా కళ్ళముందు ఎన్నో తప్పులు చేశాడు. అతడి తప్పులు అన్ని కూడా సమయం వచ్చినప్పుడు బయటపెడతాను. నేను ఒక మహిళను అవ్వడం వల్ల ఇన్నాళ్లు నన్ను బెదిరించడం వల్ల నేను ఆ విషయాలను చెప్పలేక పోయాను. ఇప్పుడు ఆ సమయం వచ్చింది అనిపిస్తుంది అంటూ విశాల్ బండారం బయట పెడతానని సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి దీనికి విశాల్ రెస్పాన్స్ ఏంటో చూడాలి.
Tags:    

Similar News