తమిళ నటీనటుల కోసం ఏర్పాటు చేసిన నడిగర్ సంఘం వ్యవహారాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. శరత్ కుమార్ అండ్ కో విషయంలో పంతం పట్టిన విశాల్.. తాజాగా జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో ఓ సంచలన తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. శరత్ కుమార్.. రాధారవిలను సంఘం నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తూ పెట్టిన ఈ తీర్మానం ఆమోదం కూడా పొందింది.
ఇలా జరిగిన మరుసటి రోజే విశాల్ ఇంటి ముందు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు విశాల్ ఇంటి మీద దాడి చేశారు. రాళ్లు విసిరారు. విశాల్ బీఎండబ్ల్యూ కారుతో పాటు ఇంటి అద్దాలు కూడా పగిలాయి. ఐతే ఈ దాడి చేసిన వ్యక్తులు చుట్టుపక్కలవాళ్లు అప్రమత్తం అయ్యేసరికి అక్కడి నుంచి పారిపోయారు. ఇది శరత్ కుమార్ అభిమానుల పనే అని అనుమానిస్తున్నారు.
దీని వల్ల విశాల్ కు ఆర్థికంగా నష్టం జరిగి ఉండొచ్చేమో కానీ.. నైతికంగా మాత్రం ఇది అతడికి కలిసొచ్చే విషయమే. శరత్ కుమార్.. రాధారవి నడిగర్ సంఘానికి చెందిన భూమిని అక్రమంగా కాజేశారని విశాల్ ఆరోపిస్తున్నాడు. మొదట్నుంచి విశాల్ అన్యాయాలపై పోరాడుతున్నాడన్న ఫీలింగ్ జనాల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే శరత్ కుమార్.. రాధారవిల మీద వేటు వేయడంపై సినీ పరిశ్రమలో కూడా పెద్దగా వ్యతిరేకత రావట్లేదు.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/