కామెడీ కొనసాగిస్తున్న కౌశల్

Update: 2018-10-12 17:03 GMT
‘బిగ్ బాస్’ రెండో సీజన్లో విజేతగా నిలిచిన కౌశల్.. ఈ షో నుంచి బయటికి వచ్చాక మీడియా ఇంటర్వ్యూల్లో చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. తన ఇంటికి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కాల్ వచ్చిందని.. తనకు గిన్నిస్ బుక్ వాళ్లు ఫోన్ చేశారని.. ఒక ఫారిన్ యూనివర్శిటీ వాళ్లు డాక్టరేట్ ప్రదానం చేస్తారని అన్నారని అతను చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది. ఈ వ్యాఖ్యల్లో నిజమెంతో కానీ.. వీటి వల్ల కామెడీ అయిపోయాడు కౌశల్. ఐతే సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలపై ట్రోలింగ్ నడుస్తున్నా కూడా కౌశల్ మారలేదు. తాజాగా విశాఖపట్నానికి వెళ్లిన కౌశల్.. అక్కడి మీడియా ఇంటర్వ్యూలోనూ మళ్లీ అదే వ్యాఖ్యలు చేశాడు.

‘బిగ్ బాస్’ విజేత అయ్యాక స్పందన ఎలా ఉంది అని అడిగితే.. ‘‘హౌస్ నుంచి వచ్చాక నాకు తొలిసారిగా ఫోన్‌ చేసిన దర్శకుడు మారుతి. అలాగే సుకుమార్‌ కూడా ఫోన్‌ చేసి అభినందించారు. అంతేకాక ప్రధానమంత్రి కార్యాలయం నుంచి శుభాకాంక్షలు అందాయి. త్వరలో డాక్టరేట్‌ ప్రదానం చేస్తామని ఒక యూనివర్సిటీ నుంచి ఫోన్‌ వచ్చింది. దీంతో పాటు గిన్నిస్ బుక్ వాళ్లూ కాల్ చేశారు. ఇంకా ఎందరో అభినందించడం చాలా సంతోషంగా ఉంది’’ అని అతనన్నాడు. తాను రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు కూడా కౌశల్ చెప్పాడు. తాను హీరోగానే కాక ప్రతినాయకుడి పాత్రలకు బాగా సూటవుతానని అతనన్నాడు.మిగతా విషయాలేమో కానీ.. ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఫోన్ చేశారనడమే విడ్డూరంగా ఉంది జనాలకు.



Tags:    

Similar News