'మిర్చి' అనుకుని 'టెంపర్' కు ఫిక్సయ్యాడట

Update: 2018-10-28 15:30 GMT
‘బాహుబలి’కి ముందు ప్రభాస్ కెరీర్లో అతి పెద్ద హిట్టుగా నిలిచిన సినిమా ‘మిర్చి’. ఈ సినిమాతో నేరుగా స్టార్ స్టేటస్ పంపాదించాడు దర్శకుడు కొరటాల శివ. 2013లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో చాలా బాగా ఆడింది. దీన్ని కన్నడలో రీమేక్ చేశారు. తమిళంలోకి కూడా రీమేక్ అవుతుందని ప్రచారం జరిగింది కానీ.. అది నిజం కాలేదు. ఇప్పుడు మాస్ హీరో విశాల్ తాను ‘మిర్చి’ని రీమేక్ చేయడానికి ప్రయత్నించినట్లు వెల్లడించాడు.

‘మిర్చి’ తనకెంతో నచ్చిందని.. ఆ సినిమా హక్కులు తీసుకుని తనే హీరోగా స్వీయ నిర్మాణంలో రీమేక్ చేయాలని అనుకున్నానని విశాల్ వెల్లడించాడు. కానీ తర్వాత వేరే సినిమాలతో బిజీ అయ్యానని.. ఆపై ‘టెంపర్’ చూశాక దాన్ని రీమేక్ చేయాలని ఫిక్సయ్యానని చెప్పాడు. ‘టెంపర్’ సోషల్ కాజ్ తో ముడిపడ్డ సినిమా అని.. అది ఇప్పటి కాలానికి చాలా అవసరమైన చిత్రం కూడా అని.. అందుకే దాన్ని రీమేక్ చేయాలని ఫిక్సయినట్లు విశాల్ వెల్లడించాడు.

‘టెంపర్’ రీమేక్ తమిళంలో ‘అయోగ్య’ పేరుతో రీమేక్ చేస్తున్నట్లు వెల్లడించిన విశాల్.. ఈ చిత్రాన్ని తన గత సినిమాల మాదిరి తెలుగులోకి అనువాదం చేయబోమని స్పష్టం చేశాడు. అలా చేస్తే.. తెలుగులో ఎన్టీఆర్ నటనతో తన యాక్టింగ్ పోల్చి చూస్తారని.. అప్పుడు తాను నిలవలేనని.. తేలిపోతానని అన్నాడు విశాల్. ఎన్టీఆర్ అద్భుతమైన నటుడని.. ‘టెంపర్’లో గొప్పగా నటించాడని.. ఈ చిత్రాన్ని దర్శకుడు రెండోసారి చూడమని చెప్పినా.. ఎన్టీఆర్ ప్రభావం తన మీద పడుతుందని భయపడి రెండోసారి చూడటానికి ఇష్టపడలేదని విశాల్ చెప్పడం విశేషం.
Tags:    

Similar News