హీరో విశాల్ కు తమిళంలో మంచి మార్కెట్ ఉంది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఆయన డబ్బింగ్ సినిమాలు విడుదల అవుతుంటాయి. విశాల్ జస్ట్ హీరోనే కాదు.. నిర్మాతగా కూడా కొన్ని సినిమాలను విశాల్ ఫిలిం ఫాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తుంటాడు. అయితే తాజాగా విశాల్ తన సినిమాల విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాడట. ఇకపై తన సినిమాలన్నీ స్వయంగా నిర్మిస్తానని అంటున్నాడు.
విశాల్ లేటెస్ట్ ఫిలిం 'అయోగ్య' కొద్దిరోజుల క్రితం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. 'టెంపర్' కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకు విడుదల సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఫైనాన్సు సమస్యల కారణంగా ఆలస్యంగా రిలీజ్ అయింది. దానికి కారణంగా దాదాపు రూ. 4 కోట్ల వరకూ నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా. ఈ విషయం విశాల్ ను అప్సెట్ చేసినట్టుంది. అందుకే "సినిమా నిర్మాణానికి అవసరమైన వనరులు నాదగ్గర ఉన్నాయి. అందుకే ఇక ఫ్యూచర్ లో వేరే నిర్మాతపై ఆధారపడడం.. వారు నన్ను ఇబ్బంది పెట్టడం లాంటివి జరగకుండా నా సినిమాలను నేనే స్వయంగా నిర్మించుకుందామని నిర్ణయించుకున్నాను" అని తెలిపాడు.
విశాల్ ప్రస్తుతం సుందర్.సీ దర్శకత్వంలో ఒక యాక్షన్ థ్రిల్లర్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో విశాల్ కు జోడీగా తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత విశాల్ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం నేపథ్యంలో ఒక సినిమాను నిర్మించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమా వివరాలు త్వరలో వెల్లడవుతాయి.