తేజ దర్శకత్వంలో మొదలుపెట్టినప్పుడు హడావిడి చేసినా క్రిష్ చేతిలోకి వచ్చాక మాత్రం సైలెంట్ గా గుట్టుచప్పుడు కాకుండా ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ జరిగిపోతోంది. నాన్న కథను తెరమీద చూసుకోవాలన్న బాలయ్య కోరిక నెరవేరే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి . ఒకరిద్దరి గురించి తప్ప పాత్రధారుల వివరాలు బయటికి రాకుండా యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. క్రిష్ కూడా బయట కనిపించడం మానేసాడు. ఒక పక్క మణికర్ణిక బాలన్స్ వర్క్ తో పాటు ఎన్టీఆర్ బయోపిక్ సమాంతరంగా చూసుకోవాల్సి రావడం వల్ల క్రిష్ ఒత్తిడిని ఫేస్ చేస్తున్న మాట నిజం. పైగా మణికర్ణిక కొంత భాగం రీ షూట్ కు వెళ్లబోతోంది అనే బాలీవుడ్ మీడియాలో వస్తున్న కథనాలు క్రిష్ ను ఇబ్బంది పెట్టేవే.
మొదట ఎన్టీఆర్ ని సాయి కొర్రపాటి ఒక్కరే నిర్మిస్తారు అనే ప్రచారం జరగగా వాటికి చెక్ పెడుతూ బాలకృష్ణ ఇందులో తన భాగస్వామ్యం ఉంటుందని తన పేరు మీదే ఉన్న బ్యానర్ తోనే పోస్టర్ కూడా విడుదల చేసాడు. సో ఈ ఇద్దరే ఉంటారు అనుకున్నారు కానీ తాజాగా ఇందులో మరో నిర్మాణ సంస్థ కూడా వచ్చి చేరిందట. విబ్రి మీడియాకు చెందిన విష్ణు ఇందూరి కూడా ఇందులో పార్టనర్ గా ఉండబోతున్నారు. నిజానికి ఎన్టీఆర్ బయోపిక్ తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేసిన క్రమంలో విష్ణు చాలా యాక్టివ్ గా చర్చల్లో పాల్గొన్నారట. అందుకే సాయి కొర్రపాటి తనను కూడా ఇందులో భాగం అయ్యేలా బాలయ్యను ఒప్పించినట్టు తెలిసింది. కాకపోతే సగం బడ్జెట్ బాలకృష్ణది ఉంటే మిగిలిన సగం ఈ ఇద్దరిది ఉంటుందన్న మాట. ప్రస్తుతానికి బడ్జెట్ ని 50 కోట్లకు లాక్ చేసినట్టు సమాచారం.
గౌతమి పుత్ర శాతకర్ణిని చెప్పిన టైంలో అనుకున్న బడ్జెట్ దాటకుండా పూర్తి చేసిన క్రిష్ ఖర్చును ఎక్కువ కాకుండా చూసుకుంటాడనే నమ్మకంతో డిసైడ్ చేసినట్టు సమాచారం. అంటే బాలయ్య ఒక్కడే 25 కోట్లు పెట్టేస్తున్నాడన్న మాట. లాభాలు కూడా అదే నిష్పత్తిలో పంచుకోవడం సహజం. వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేసిన ఎన్టీఆర్ జనవరి 9 విడుదల చేసేలా ప్లానింగ్ జరుగుతోంది. ఫస్ట్ లుక్ తోనే ఇందులో ఏం ఉండబోతోందో చెప్పిన క్రిష్ ఎన్టీఆర్ సినిమా జీవితాన్ని మాత్రమే చూపించబోతున్నట్టు తెలిసింది.