తెలుగులోనూ ఘన విజయం సొంతం చేసుకున్న రాక్షసుడు ఒరిజినల్ వెర్షన్ రట్సాసన్ లో నటించిన విష్ణు విశాల్ దాన్నుంచి ఇమేజ్ తో పాటు మార్కెట్ ను కూడా అమాంతం పెంచేసుకున్నాడు. అప్పటిదాకా ఓ మోస్తరు బడ్జెట్ తో ఇతని సినిమాలు లాగించిన నిర్మాతలు ఇప్పుడు భారీ పెట్టుబడులకు సైతం రెడీ అంటున్నారు. అది అంత పెద్ద హిట్ అయ్యింది కాబట్టే కొన్ని నెలలు లేట్ అయినా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇష్టపడి మరీ రీమేక్ చేసుకుని హిట్ కొట్టాడు.
తమిళ్ మూవీలో అమలా పాల్ హీరోయిన్ గా నటించింది. ఇప్పుడీ కాంబినేషన్ మరోసారి తెలుగు రీమేక్ కోసం జట్టు కట్టబోతోందని చెన్నై టాక్. నాని-శ్రద్దా శ్రీనాథ్ జోడిగా వచ్చిన జెర్సీ క్రిటిక్స్ నుంచి ప్రేక్షకుల దాకా అందరి మెప్పు పొందిన సంగతి తెలిసిందే. హిందీలో సైతం రూపొందించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి. తమిళ్ లో విష్ణు విశాల్-అమలా పాల్ కాంబోలోనే జెర్సీని రీమేక్ చేయబోతున్నట్టుగా తెలిసింది.
ఒక క్రికెటర్ బయోపిక్ తరహాలో ఫాదర్ సెంటిమెంట్ ని హై లైట్ చేస్తూ రూపొందిన జెర్సీ నాని కెరీర్లో స్పెషల్ మూవీగా నిలిచిపోయింది. ఇప్పుడు ఈ రెండు భాషల్లోనూ ఇదే తరహా రెస్పాన్స్ వస్తుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. హిందీలో గౌతమ్ తిన్ననూరినే బాధ్యత తీసుకోనుండగా తమిళ్ డైరెక్టర్ ఇంకా ఖరారు కావలసి ఉంది. అన్నట్టు తమిళ వెర్షన్ మన రానానే నిర్మించబోతున్నట్టు మరో హాట్ అప్ డేట్. అఫీషియల్ న్యూస్ వచ్చాక ఇవన్నీ ఖరారుగా తీసుకోవచ్చు