క్రీడలు- సినిమా జోడు గుర్రాల్లాంటివి. ఈ రెండు రంగాల్లో ఉన్న క్రేజు ఎంతో ప్రత్యేకమైనది. అందుకే రిలేషన్ షిప్స్ ఎప్పుడూ ఈ రెండు రంగాల్ని విడదీయడం లేదు. ఆ కోవలోనే ఎన్నో ప్రేమ వివాహాలు చూస్తున్నదే. క్రీడాకారుల్ని పెళ్లాడేందుకు కథానాయికలు ఆసక్తి చూపిస్తుంటారు. అలాగే సినిమా హీరోలు క్రీడాకారిణిల వైపు దృష్టి సారించడం సరికొత్త ట్రెండ్. ఇటీవలి కాలంలో బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తాతో తమిళ హీరో విష్ణు విశాల్ ఎఫైర్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఇదివరకూ ఆ ఇద్దరూ ఎంతో సన్నిహితంగా ఉన్న ఫోటోల్ని సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా రివీల్ చేయడంతో నెటిజనుల్లో ఆసక్తికర చర్చ సాగింది. జ్వాలాతో విష్ణు విశాల్ ఎఫైర్ కన్ఫామ్ అయ్యిందంటూ ప్రచారం సాగించారు. అంతకుముందు కథానాయిక అమలాపాల్ తోనూ విష్ణు విశాల్ ఎఫైర్ సాగించాడని ప్రచారమైంది. అయితే వీటన్నిటిపైనా విష్ణు విశాల్ స్పందనలు ఎప్పటికప్పుడు బయట పడుతూనే ఉన్నాయి.
తాజాగా ఓ ప్రముఖ మీడియాతో ముచ్చటించిన విష్ణు విశాల్ .. జ్వాలాతో తన రిలేషన్ షిప్ పరిధి గురించి చెప్పారు. తమిళ నటుడు విష్ణు విశాల్ 2018 నవంబర్ 13 న భార్య రజినీ నుంచి విడిపోయారు. ఈ వార్త అందరినీ షాక్ కు గురి చేసింది. భార్యకు విడాకులివ్వడానికి కారణాన్ని విష్ణు ఎప్పుడూ వెల్లడించలేదు. అటుపై `మీరు మారిపోయారు` అనే ప్రశ్న ఎదురైంది. అది ఎంతో కలచివేసిందని విష్ణు ఒకానొక సందర్భంలో అన్నారు. విడాకులు అతన్ని నిరాశకు గురి చేసింది. కానీ ఎలాగోలా బయటపడ్డాడు. కాస్త ఆలస్యంగానే.. బ్యాడ్మింటన్ ప్లేయర్ జ్వాలా గుత్తాతో నటుడి సంబంధం బలపడిందన్న ప్రచారం మొదలైంది. అయితే తాజా ఇంటర్వ్యూలో విష్ణు మాట్లాడుతూ ప్రతిసారీ తనకు ఎవరో ఒకరితో సంబంధం అంటగడుతున్నారన్న ఆవేదనను వ్యక్తం చేశాడు. అలా తనపై ఉన్నవి లేనివి రాయడం వల్ల ఇబ్బంది కలిగిందని అన్నాడు. జ్వాలాతో గడిపిన చిత్రాలను పోస్ట్ చేసినప్పుడు.. ఒక వర్గం తనపై కామెంట్ చేసిందని... అది సరి కాదని విష్ణు ఆవేదన వ్యక్తం చేశాడు. భార్య రజనీతో విడిపోవడం వెనుక అమలా పాల్ తో ఉన్న ఎఫైర్ కారణం అంటూ ప్రచారం సాగించారని ఆయన అన్నారు.
``నన్ను బాధించేది ఏమిటి? అంటే.. జనం ప్రతిదీ ఊహించేసుకోవడమే. అందులో నిజం ఎంత అన్నది గ్రహించకుండా ఒకరి జీవితం గురించి వ్యాఖ్యానించడం విసిగించింది. నేను జ్వాలా చిత్రాలను పోస్ట్ చేసినప్పుడు లేదా ఆమె పోస్టింగ్ చేసినప్పుడు ఒక సెక్షన్ అసలు విషయాన్ని తారుమారు చేసి ప్రచారం చేసేశారు. జ్వాలా గుత్తా కారణంగా నేను నా భార్య నుండి విడిపోయానని కొందరు ప్రచారం సాగించారు. మరొకరు రచ్చాసన్ (రాక్షసుడు) చిత్రీకరణ సమయంలో నేను అమలా పాల్ తో రిలేషన్ లో ఉన్నానని అందుకే విడాకులు అయ్యిందని ప్రచారం చేసారు. నేను విడిపోవడానికి అసలు కారణాన్ని వెల్లడించి ఈ రూమర్లు అన్నీ సరికాదని నిరూపించలేను. ఇది పూర్తిగా నా వ్యక్తిగత విషయం`` అని అన్నారు.
జ్వాలాను పెళ్లాడబోతున్నారా? అన్న ప్రశ్నకు సమాధానంగా ``నేను జీవన సాంగత్యాన్ని నమ్ముతాను. రెండో వివాహం కోసం ఎదురు చూడటం లేదు.. ఒకరినొకరు అర్థం చేసుకోవడం కోసమే జ్వాలాతో సమయం గడుపుతున్నాను.. అని విష్ణు విశాల్ తెలిపారు. విష్ణు విశాల్ ప్రస్తుతం తమిళంలో బిజీ హీరో. రానా నిర్మాతగా తెరకెక్కుతున్న `జెర్సీ` తమిళ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.