యాంకర్‌ పై విశ్వక్ సేన్ పరువునష్టం దావా..?

Update: 2022-05-03 06:30 GMT
టాలీవుడ్ హీరో విశ్వక్‌ సేన్‌ మరియు టీవీ9 యాంకర్ దేవి మధ్య నిన్న లైవ్ డిబేట్ లో తీవ్ర వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. 'అశోక వనంలో అర్జున కళ్యాణం' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చేసిన ఓ ఫ్రాంక్ వీడియో విమర్శల పాలైన నేపథ్యంలో.. దీనిపై డిబేట్ కోసం న్యూస్ ఛానల్ వారు విశ్వక్ ను స్టూడియోకి ఆహ్వానించారు.

ఈ క్రమంలో విశ్వక్ సేన్ ను 'పాగల్ సేన్' అని పిలుస్తారని.. అతనొక 'డిప్రెస్డ్ మ్యాన్' అని యాంకర్ దేవీ అనడం పై విశ్వక్ సేన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో 'గెట్ అవుట్ ఆఫ్ మై స్టుడియో' అంటూ గట్టిగా అరిచింది దేవి.

అంతేకాదు విశ్వక్ బయటకు వస్తున్న సమయంలో 'వెధవ.. నోరుమూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో' అంటూ అరవడం వీడియోలో కనిపించింది. ఈ ఇష్యూలో నెటిజన్లు టీవీ9 యాంకర్ ప్రవర్తించిన తీరుపై విమర్శలు చేసారు. హీరో వ్యవహార శైలి ఎలా ఉన్నా.. అతన్ని స్టూడియోకి పిలిచి ఇలా అవమానించడం జర్నలిజం అనిపించుకుంటుందా అని ప్రశ్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తనను వ్యక్తిగతంగా కించపరిచే విధంగా మాట్లాడినందుకు టీవీ9 యాంకర్‌ దేవి పై పరువు నష్టం దావా వేయాలని విశ్వక్ సేన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆమె పై పరువు నష్టం కేసు ఫైల్ చేయడానికి ఇప్పటికే అతని లీగల్ టీమ్ రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇకపోతే టీవీ9​ డిబెట్​ లో విశ్వక్​ సేన్​ అభ్యంతరకరమైన F***​ అనే పదాన్ని ఉపయోగించారు. అయితే మీడియా హౌస్ లో అలాంటి పదాన్ని వాడినందుకు విశ్వక్ సేన్ క్షమాపణలు చెప్పారు. సోమవారం సాయంత్రం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఈ మేరకు మాట్లాడారు.

''దెబ్బ తగిలినప్పుడు అమ్మా అన్నట్టే.. ఆ పదం అలా వచ్చింది. నిజంగా అలానే వచ్చేసింది. ఇప్పట్లో చిన్న పిల్లలకు 16 ఏళ్ల వయసున్న యూత్​ కు వద్దన్నా ఆ పదం వచ్చేస్తోంది. కానీ మీడియాలో ఆ పదం వాడినందుకు సారీ. దీనిపై నోట్ టైప్ చేస్తున్నా. రేపు (మే 3) క్లారిటీగా ఓ నోట్ రిలీజ్ చేస్తా'' అని విశ్వక్ సేన్ అన్నారు.  

ఇకపోతే ఈ వ్యవహరమంతా 'అశోకవనంలో అర్జున కల్యాణం' చిత్రానికి కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. విశ్వక్ సేన్ - రుక్సార్ థిల్లాన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మే 6న విడుదల కాబోతోంది. విద్యా సాగర్ చింతా ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో బాపినీడు - సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మించారు.
Tags:    

Similar News