టాలీవుడ్ యువ హీరో తన సినిమాల కన్నా వివాదాల్లో ఎక్కువ నిలుస్తున్నాడు. మొదటి సినిమా నుంచి ప్రతి సినిమాకు అతను చేస్తున్న వెరైటీ ప్రమోషన్స్ కావొచ్చు.. అతని యాటిట్యూడ్ కావొచ్చు ఎఫెక్ట్ పడేలా చేస్తుంది. ఇంతకీ ఆ హీరో ఎవరో ఈపాటికి మీరు గెస్ చేసి ఉండొచ్చు. అవునండి అతనే మన విశ్వక్ సేన్. కుర్రాడిలో టాలెంట్ మస్త్ గా ఉందని మొదటి రెండు సినిమాలతోనే ప్రూవ్ చేసుకున్నాడు. టాలెంట్ ఉన్న ఈ హీరో ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అవుతున్నా రెగ్యులర్ గా ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తున్నాడు.
సినిమా మీద అతకిని ఉన్న కమిట్మెంట్ తో డైరక్షన్ కూడా చేస్తూ వస్తున్నాడు విశ్వక్ సేన్. ఫలక్ నుమా దాస్ అంటూ అతను చేసిన మూవీ అతన్ని మాస్ కా దాస్ అయ్యేలా చేసింది. అయితే తనకు వచ్చిన ఈ మాస్ ఇమేజ్ స్క్రీన్ మీదనే అనే విషయాన్ని అప్పుడప్పుడు మర్చిపోతున్నాడు విశ్వక్ సేన్. ప్రతి సినిమాకు వెరైటీ ప్రమోషన్స్ అంటూ ఏదో ఒక హడావిడి చేయడం తద్వారా న్యూస్ లో హైలెట్ అవడం తెలిసిందే.
కెరియర్ మొదట్లోనే ఓ రిపోర్టర్ పై గొడవకి దిగిన విశ్వక్ సేన్ ఆ మధ్య ఓ సినిమా ప్రమోషన్ కోసం న్యూస్ ఛానెల్ కి వెళ్లి అక్కడ న్యూస్ రీడర్ తో గొడవ పడ్డారు. ఇతన్ని ఆ న్యూస్ రీడర్ గెటౌట్ అని కూడా అనేసింది. తన యాటిట్యూడ్ చూపించడం వల్ల కొంతమంది దర్శకులు కూడా విశ్వక్ సేన్ మీద గుర్రుగా ఉన్నారని టాక్. రీసెంట్ గా ఓరి దేవుడా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశ్వక్ సేన్. బహుశా ఎలాంటి గొడవలు, వివాదాలు లేకుండా రిలీజైన సినిమా అదే కావొచ్చు.
ఆ సినిమా ఎలాగు సాఫీగా రిలీజైంది అనుకునేలోగా మరో వివాదం విశ్వక్ సేన్ మీద వచ్చింది. సీనియర్ యాక్టర్ అర్జున్ డైరక్షన్ లో విశ్వక్ సేన్ ఓ సినిమా కమిట్ అయ్యాడు. ఆ సినిమాకు పనిచేయాలన్న ఇంట్రెస్ట్ లేదో మరి కథ నచ్చలేదో కానీ అర్జున్ సినిమాకు విశ్వక్ డేట్స్ ఇస్తానని చెప్పి రెండు మూడు సార్లు హ్యాండ్ ఇచ్చాడట. దాని వల్ల అర్జున్ ప్రొడక్షన్ కాస్ట్.. యూనిట్ పడ్డ కష్టం అంతా వేస్ట్ అయ్యింది.
ఈ విషయంపై రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టి విశ్వక్ ఇలా చేయడం తనకు నచ్చలేదు. సినిమా పట్ల కమిట్మెంట్ తో పనిచేస్తున్న చాలామంది స్టార్స్ తనకు తెలుసని.. విశ్వక్ తననే కాదు తన టీం ని కూడా అవమాన పరిచాడని అన్నారు. అసలు ఈ గొడవకి కారణం ఏంటా అని ఆలోచిస్తే.. విశ్వక్ కేవలం హీరో మాత్రమే కాదు డైరక్టర్ కూడా.. అదే అతనికి ప్లస్ అవుతుంది.. ఒక్కోసారి మైనస్ కూడా అవుతుంది.
డైరక్టర్ గా తను చేస్తున్నప్పుడు తన ఐడియాలన్నిటినీ పెట్టేయొచ్చు కానీ హీరోగా వేరే డైరక్టర్ తో చేసేప్పుడు మాత్రం అతను డైరక్టర్ అన్న విషయాన్ని మర్చిపోవాలి. డైరక్టర్ ని ఆఫ్ మోడ్ లో ఉంచి సినిమా చేయాలి. అలా కాకుండా హీరో, డైరక్టర్ కలిసి వేరే డైరక్టర్ కి సలహాలు ఇస్తే కొందరు తీసుకోకపోవచ్చు. అర్జున్ సర్జా తన మీద చేసిన ఎలిగేషన్స్ కి విశ్వక్ సేన్ స్పందిస్తూ కేవలం తన ఆలోచనలకు అక్కడ రెస్పెక్ట్ లేదనే కారణంగానే సినిమా నుంచి తప్పుకున్నానని అన్నారు. ఓ పక్క అర్జున్ ఏమో తన ఐడియాలని కూడా పెట్టాలని తానే చెప్పానని అన్నారు.
ఈ ఇద్దరు రెండు రకాల స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇక్కడ తప్పెవరిది అనడం కన్నా విశ్వక్ సేన్ తను ఓకే చేసిన సబ్జెక్ట్ ని సెట్స్ లో డైరక్టర్ గా కూడా సెట్ చేయాలని అనుకుంటాడు. అందుకే ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పొచ్చు. అర్జున్ సినిమా నుంచి ఎగ్జిట్ అయినంత మాత్రాన విశ్వక్ సేన్ ఇమేజ్ కి ఏమీ జరగదు. కానీ ఇలాంటి మరోసారి రిపీట్ అయితే మాత్రం అతని మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. యువ హీరోగా మంచి సినిమాలతో దూసుకెళ్తున్న విశ్వక్ సినిమాల విషయంలో కొద్దిగా మార్పులు చేసుకుంటే అతను ఖచ్చితంగా ఫ్యూచర్ లో టాప్ పొజిషన్ లో ఉంటాడు. టాలెంట్ అందరికి ఉంటుంది కానీ దాన్ని సరైన పద్ధతితో ఉపయోగిస్తేనే ఎవరైనా స్టార్స్ అవుతారు. ఇలా అనవసరమైన పరిస్థితులకు దారి తీస్తే కెరియర్ లో వెనకపడే అవకాశం ఉంటుంది. విశ్వక్ సేన్ ఈ విషయంపై చాలా సీరియస్ డెశిషన్ తీసుకోవాల్సిందే. లేదంటే అతని కెరియర్ మున్నాళ్ల ముచ్చటే అవుతుంది.