కరోనా నేపథ్యంలో విశ్వక్ సేన్ సినిమా

Update: 2020-03-31 14:39 GMT
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా సృష్టిస్తున్న విజృంభణ అంతా ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేలమందిని బలి తీసుకుంది. వివిధ దేశాల్లో ఉన్న మన భారతీయులు స్వదేశానికి తిరిగి రాలేక అక్కడే ఇరుక్కుపోయారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఒక సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తుండగా వేణు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఏప్రిల్ 3న విడుదల కానుంది. అంతేకాకుండా మన దేశంలోని కార్మికులు ఎందుకు వలస వెళ్తున్నారు, అక్కడ వారు ఎదుర్కొనే సమస్యలను కూడా ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు సమాచారం.

విశ్వక్ సేన్.. 'వెళ్లిపోమాకే' చిత్రం ద్వారా పరిచయమై, తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ డిఫరెంట్ స్టైల్ యాక్టింగ్ తో యూత్ కి బాగా దగ్గరయ్యారు. ఈ చిత్ర విజయం తర్వాత దర్శకుడిగా అవతారమెత్తి 'ఫలక్ నామా దాస్' చిత్రాన్ని నిర్మించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవ‌ల విడుద‌లైన 'హిట్' చిత్రంలో ఇన్స్పెక్టర్ విక్రమ్ రుద్రరాజు పాత్ర పోషించిన విశ్వక్ సేన్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అలరించాడు. ఫలక్ నామా దాస్ మరియు హిట్ సినిమాలు సక్సెస్ అవడంతో విశ్వక్ సేన్ మార్కెట్ బాగా పెరిగింది. ఈ నేప‌థ్యంలో ఆచితూచి క‌థ‌ల‌ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం నరేష్ కొప్పల్లి అనే కొత్త దర్శకుడితో 'పాగల్' అనే సినిమాలో నటిస్తున్నాడు.
Tags:    

Similar News