మెగాస్టార్ చిరంజీవి నటించే 150వ సినిమా ప్రస్తుతం హాట్ టాపిక్. ఈ సినిమా ఎప్పుడు ఉంటుంది? అన్న ప్రశ్నకు త్వరలోనే ప్రకటిస్తామని చరణ్ చెప్పాడు. అయితే ఆ ప్రకటన వచ్చే ముందే కొన్ని అప్ డేట్స్ బైటికి తెలుస్తున్నాయి. విజయ్ హీరోగా నటించిన కోలీవుడ్ హిట్ చిత్రం కత్తి రీమేక్‌లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు. వి.వి.వినాయక్ ఇప్పటికే స్ర్కిప్టును రెడీ చేస్తున్నారు.
ఈ సినిమాని అమరావతి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించాలన్నది ప్లాన్. అందుకోసం ఒరిజినల్ కథారచయిత ఏ.ఆర్.మురుగదాస్ సాయం అడిగారని సమాచారం. మెగాస్టార్ - వినాయక్ ఇప్పటికే మురుగదాస్ తో డిష్కసన్స్ సాగిస్తున్నారు. ఈ స్ర్కిప్టును డెవలప్ చేసే పనిలో ఉన్నారు. ఈ లోగానే ఈ చిత్రంలో విలన్ గా ఎవరు నటిస్తే బావుంటుంది? అన్న డిష్కసన్ సాగింది. దానికి బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ అయితే బావుంటుందని భావిస్తున్నారుట.
ఒరిజినల్ వెర్షన్ లో నీల్ నితిన్ ముఖేష్ చేసిన క్యారెక్టర్ లో వివేక్ ఒబేరాయ్ నటిస్తాడని చెబుతున్నారు. వివేక్ ఒబేరాయ్ తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే తెలుసు. రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర సినిమాలో పరిటాల రవి క్యారెక్టర్ లో నటించాడు. అలాగే టాలీవుడ్ నుంచి భారీగా సొమ్ముల్ని కొల్లగొట్టిన క్రిష్ 3 చిత్రంలో వివేక్ విలన్ గా నటించాడు. అందువల్ల వివేక్ ఒబేరాయ్ విలనీ ఈ చిత్రానికి ప్లస్ అవుతుందనే భావిస్తున్నారంతా.