అజిత్ కుమార్ తమిళనాట పెద్ద హీరో. అతడికి అక్కడ భారీగా అభిమాన గణం ఉంది. అతడి సినిమాకు సంబంధించి ఏదైనా విశేషం బయటికి వస్తోందంటే.. హడావుడి మామూలుగా ఉండదు. కొన్ని రోజుల ముందే కౌంట్ డౌన్లు మొదలవుతాయి. అర్ధరాత్రి ముహూర్తాలు పెట్టి టీజర్ లాంటి విశేషాల్ని బయటపెడతారు. అభిమానులు క్షణ క్షణం ఉత్కంఠగా ఎదురు చూస్తారు. ఆ విశేషాలు బయటికి రాగానే సోషల్ మీడియాలో హోరెత్తిచ్చేస్తుంటారు.
ఐతే అజిత్ కు తెలుగులో చెప్పుకోదగ్గ ఫాలోయింగ్ ఏమీ లేదన్న మాట వాస్తవం. అతడి సినిమాలు తెలుగులోకి అనువాదమై రిలీజవ్వడమే గగనం. అలాంటిది అజిత్ కొత్త సినిమా ‘వివేగం’ తెలుగు వెర్షన్ టీజర్ రిలీజ్ అంటూ చేసిన హడావుడి చూస్తే కామెడీగా అనిపించకమానదు. ‘వివేగం’ సినిమాను తెలుగులోకి ‘వివేకం’ పేరుతో అనువాదం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న సోషల్ మీడియాలో చేసిన హడావుడి చూడాలి.
అతి త్వరలో ‘వివేగం’ తెలుగు టైటిల్ ప్రకటన అంటూ ముందుగా హంగామా మొదలుపెట్టారు. కాసేపటి తర్వాత ‘వివేకం’ అంటూ తమిళ టైటిల్ ను మక్కీకి మక్కీ కాపీ కొట్టేసి తెలుగు టైటిల్ అనౌన్స్ చేశారు. ఇంతవరకు కూడా బాగానే ఉంది. ఇక ఆ తర్వాత అర్ధరాత్రి 12 గంటలకు ఈ చిత్ర టీజర్ అంటూ హడావుడి మొదలైంది. అలా అర్ధరాత్రి ముహూర్తాలు పెట్టి టీజర్ లాంచ్ చేయడానికి అజిత్ ఇక్కడ పెద్ద స్టార్ కాదు. పన్నెండింటి వరకు మన జనాలు ఉత్కంఠగా టీజర్ గురించి ఎదురు చూసే పరిస్థితి ఎంతమాత్రం లేదు.
పైగా తమిళ టీజర్ ఇంతకుముందే సోషల్ మీడియాలో వైరల్ అయింది కాబట్టి దాన్ని రెగులర్ మూవీ బఫ్స్ అందరూ దాన్ని ముందే చూసేశారు. పోనీ తెలుగు వెర్షన్ కోసం ఏమైనా కొత్త టీజర్ రెడీ చేశారా అంటే అదీ లేదు. తమిళ టీజర్ కే తెలుగు డైలాగులు జోడించి వదిలారు. టీజర్లో అజిత్ చెప్పిన ఇంగ్లిష్ డైలాగునైతే అలాగే వదిలేశారు కూడా. ఈ మాత్రం దానికి అర్ధరాత్రి 12 గంటలకు టీజర్ లాంచింగ్ అంటూ హడావుడి.. దానికో కౌంట్ డౌన్.
అజిత్ తమిళంలో ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ తెలుగులో అతడి సినిమాలు రిలీజవుతుంటే మన జనాలు అసలు పట్టించుకోనే పట్టించుకోరు. ‘వివేకం’ ఆగస్టు 10న రిలీజవుతుండగా.. అదే వీకెండ్లో మన దగ్గర మూడు క్రేజీ సినిమాలు థియేటర్లలోకి దిగుతున్నాయి. వాటికే థియేటర్ల సమస్య తలెత్తేలా ఉంటే.. మధ్యలో దీనికెక్కడ స్క్రీన్స్ ఇస్తారు? అసలు ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో ఒకేసారి రిలీజయ్యే అవకాశాలు కూడా తక్కువే.
Full View