వర్మకు.. వోడ్కాకు ఉన్న అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వర్మకు ఆ డ్రింక్ అంటే చాలా ఇష్టమనే సిరాశ్రీ అనే రచయిత వర్మ మీద రాసిన పుస్తకానికి ‘వోడ్కా విత్ వర్మ’ అనే పేరు పెట్టుకున్నాడు. ఇటీవల ‘వంగవీటి’ ప్రి రిలీజ్ ఈవెంట్లో నాగార్జున సైతం వర్మకు.. వోడ్కాకు ఉన్న కనెక్షన్ గురించి చెప్పాడు. తనకు ‘శివ’ కథను దశల వారీగా చెప్పిన వర్మ.. ప్రతిసారీ వోడ్కా తాగి వచ్చేవాడన్నాడు. తాజాగా వర్మే స్వయంగా వోడ్కా ప్రస్తావన తెచ్చాడు. ‘వంగవీటి’ సినిమాలో లీడ్ రోల్ కు సందీప్ కుమార్ అనే కొత్త నటుడిని ఎంచుకోవడంలో వోడ్కా పాత్ర గురించి చెప్పుకొచ్చాడు.
‘‘సందీప్ కుమార్ ను నేను ‘జ్యోతిలక్ష్మీ’ సినిమాకు సంబంధించిన ఒక పార్టీలో కలిశాను. అతణ్ని దూరం నుంచి చీకట్లో చూసి దగ్గరికి పిలిచాను. అతడి వివరాలు కనుక్కుంటే.. ‘జ్యోతిలక్ష్మీ’ సినిమాలో చిన్న పాత్ర చేస్తున్నట్లు చెప్పాడు. నాకు అతడిలో రంగా పోలికలు కనిపించాయి. అతడికి రంగా ఫొటోలు కొన్ని చూపించి.. అలా డ్రెస్ చేసుకుని రమ్మన్నాను. మరుసటి రోజే అతను కొన్ని ఫొటోలు పంపించాడు. రంగా పాత్రకు అతను సూటవుతాడనిపించింది. కొన్ని రోజుల తర్వాత నేను రెండు పెగ్గులు వోడ్కా తాగి ఆలోచిస్తుండగా.. ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. వెంటనే సందీప్ కు ఫోన్ చేసి వంగవీటి రాధా ఫొటో పంపించి అలా డ్రెస్ చేసుకోమన్నాను. అతను ఆ వేషంలోనూ ఫొటోలు పంపించాడు. అప్పుడు రంగా.. రాధా పాత్రలు రెండూ అతనే చేయాలని ఫిక్సయిపోయాను. అలా సందీప్.. వంగవీటి హీరో అయ్యాడు’’ అని వర్మ వివరించాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/